By: ABP Desam | Updated at : 12 May 2023 02:27 PM (IST)
Edited By: jyothi
విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు, ఓ రైతు మృతి - ఎక్కడంటే?
Elephants Died: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండ వైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.
ఏనుగుల బీభత్సం, పట్టించుకోని అధికారులు
రాత్రి సమయాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి నానా హంగామా చేస్తుంటే అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు మాత్రం వచ్చి హడావుడి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం.. అడవి జంతులు ఎటువైపు వెళ్తాయనేది ఎవరూ చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుతం చనిపోయిన నాలుగు ఏనుగులకు సంబంధించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని.. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. గజరాజులను పూడ్చి పెడతామని చెప్పారు.
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా ఏపీ వాళ్లు మృతి - వివరాలు తెలుసుకుంటున్నామని సీఎం ప్రకటన
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
Visakhapatnam Port: రెండు సరికొత్త రికార్డులను సాధించిన విశాఖ పోర్టు, మే లో 49 కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేసి రికార్డు
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం
Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ