News
News
X

సంచలనం సృష్టిస్తున్న రాధిక లేఖ- కావాలనే మావోయిస్టు పార్టీలో చేరినట్టు వివరణ

రాధిక రానిక అంటున్నారు. మావోయిస్టుల్లో చేరినట్టు లేఖ రాశారు. 2017లో అదృశ్యమైన ఆమె కోసం ఎన్‌ఐఏ తీవ్రంగా గాలించింది.

FOLLOW US: 

కొన్ని నెలల క్రితం ఎన్‌ఐఏ సోదాలతో మారుమోగిన పేరు రాధిక. విశాఖకు చెందిన ఈమె ఇన్నేళ్లకు ఓ లెటర్‌ విడుదల చేశారు.  తాను మావోయిస్టుల్లో చేరినట్టు లేఖలో పేర్కొంది. విశాఖకు చెందిన రాధిక 2017లో అదృశ్యమయ్యారు. గతంలో ఆమె చైతన్య మహిళా సంఘం సభ్యురాలు. అయితే రాధిక మావోయిస్టుల్లో చేరినట్టు సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ హైదరాబాద్‌లోని చైతన్య మహిళా సంఘం సభ్యుల ఇళ్లపై సోదాలు చేశారు. స్వప్న, దేవేంద్ర, చుక్కా శిల్ప అనే వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. 

2022 జూన్ నెలలో జరిగిన ఈ ముగ్గురి అరెస్ట్ తీవ్ర సంచలనం సృష్టించడంతోపాటుగా 2017లో అదృశ్యమైన రాధిక అంశాన్ని వెలుగులోకి తెచ్చాయి. విశాఖలోని పెదబయలు పోలీస్ స్టేషన్లో రాధిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ సోదాలు జరిపినట్టు పోలీసులు, ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లకు పల్లెపాటి రాధిక పేరుతో ఒక లేఖను రిలీజ్ చేసింది సీపీఐ మావోయిస్టు పార్టీ. 

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అరెస్టులు, సోదాలు అక్రమంగా జరిగినవేననీ..దర్యాప్తు బృందాలు చెబుతున్నట్టు తాను వైద్య విద్యార్థినినే కాదనీ చెప్పారు రాధిక. తాను డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థిని అని లేఖలో వివరించారు రాధిక. ఇష్టంతోనే మావోయిస్టుల్లో చేరినట్టు తెలిపారు. అప్పటికి తన వయస్సు 20 ఏళ్ళనీ.. ఏది తన కిష్టమో నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని లేఖలో పేర్కొన్నారు. 

చైతన్య మహిళా సంఘానికి తానెప్పుడూ రాజీనామా చేశానని దానికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని  రాధిక స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న దోపిడీ ఆగాలంటే సమాజంలో సమూల మార్పు రావాలని..దానికి మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న పోరాటంలో భాగం కావడం ముఖ్యమని భావించి వారితో కలిసినట్టు తెలిపారు. పెదబయలు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు కూడా పోలీసులు తన పేరెంట్స్‌ను బ్లాక్ మైయిల్ చేసి ఒత్తిడితో చేయించిన కంప్లైంట్‌గా వివరించారు రాధిక.

Published at : 14 Sep 2022 01:31 PM (IST) Tags: telangana police Radhika Maoist party Nia Chaitanya Mahila Sangam

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య

Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య

కార్ బార్బెక్యూ- ఇండియాలోనే మొదటిసారిగా వైజాగ్‌లో!

కార్ బార్బెక్యూ- ఇండియాలోనే మొదటిసారిగా వైజాగ్‌లో!

Vizag Temple: అమ్మవారి గర్భాలయం మొత్తం నోట్ల కట్టలూ, బంగారమే - చూస్తే మీ కళ్లు జిగేల్

Vizag Temple: అమ్మవారి గర్భాలయం మొత్తం నోట్ల కట్టలూ, బంగారమే - చూస్తే మీ కళ్లు జిగేల్

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్