అన్వేషించండి

BJP MLA Vishnukumar Raju: వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టుపై కూటమికే చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. 'వైజాగ్ వదిలేసి భోగాపురం సోకులెందుకు'? అని ప్రశ్నించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడంపై ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
  • విశాఖ నుంచే దేశీయ విమానాలు నడపాలని, ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్ట్ అవసరమని ఆయన డిమాండ్ చేశారు.
  • ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖకు విమానాశ్రయం లేకపోవడం సిగ్గుచేటని రాజు అభిప్రాయపడ్డారు.

Vishmu Kumar Raju Comments: BJP MLA విష్ణు కుమార్‌రాజు హాట్ కామెంట్స్ చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైన తరుణంలో దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.  వైజాగ్‌లో మాట్లాడిన ఆయన విశాఖ ఎయిర్‌పోర్టును క్లోజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వాసులు ఎక్కడో ఉన్న వైజాగ్‌ కోసం వెళ్లాలా అని ప్రశ్నించారు. వైజాగ్‌ను వదిలేసి భోగాపురం కోసం వెంపర్లాట ఎందుకని..?భోగాపురం విశాఖవాసులకు ఇబ్బందికరమని వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే  చేసిన కామెంట్లు ఇప్పుడు సన్సేషన్‌గా మారాయి. 

వైజాగ్ నుంచి దేశీయ విమానాలు నడపాలి- విష్ణుకుమార్ రాజు డిమాండ్

విశాఖలోని ఎయిర్‌పోర్టును మరికొన్ని రోజులు నడపాలన్నది ఆయన డిమాండ్.   "గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖ నగరానికి ఎయిర్‌పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటు" అన్నారు.  ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను పక్కనపెట్టి కేవలం బోగాపురం ఎయిర్‌పోర్ట్‌పైనే ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదన్నారు."62 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో.. విశాఖకు ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను తీసేసి బోగాపురం మాత్రమే ఉంటుందని చెప్పడం కూడా అలాంటిదే" అన్నారు. 

విష్ణుకుమార్ రాజు కామెంట్లు ఆంతర్యం ఏంటి..?

బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఈ తరహా కామెంట్లు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్నట్టుండి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారన్నది అంతుబట్టడం లేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దని ఆయన చెప్పకపోయినా .. ప్రారంభోత్సవానికి ముందు దాని ప్రాధాన్యం తగ్గించేలా మాట్లాడటం కరెక్టుగా అనిపించడం లేదు. "వైజాగ్ వదిలేసి భోగాపురం సోకులు కావాలా..?" వంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే ప్రశ్నలు వస్తున్నాయి.

విశాఖలోని ప్రస్తుత ఎయిర్‌పోర్టు నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేస్తున్నారు. అసలు విశాఖ కేంద్రంగా నడుస్తున్నవి మొత్తం దేశీయ విమానాలే. ఇప్పటికిప్పుడు ఇంటర్నేషనల్‌ ఫ్లైయిట్‌లు నడిచే పరిస్థితి లేదు. ఒకవేళ నడిచినా ఒకటి రెండు విమానాలు ఉంటాయి. దాని కోసం

అంత పెద్ద ఎయిర్‌పోర్టు కడతారా..?

అలాగే విమానాశ్రయాన్ని జూలైన 5న ప్రారంభించి 8వతేదీ నుంచ ఆపరేషన్స్ ప్రారంభించాలనుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా భోగాపురం విమానాశ్రయ పనులు జరుగుతున్నాయి. 2015లో NDA ప్రభుత్వంలోనే పనులు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆయనే బీజేపీ ఫ్లోర్‌ లీడర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. అప్పుడు ఎప్పుడూ రాని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందో తెలియడం లేదు. వైజాగ్ నుంచి భోగాపురానికి రెండు గంటలు సమయం పడుతుంది విష్ణుకుమార్‌ రాజు చెబుతున్నారు. వాస్తవానికి అంత సమయం పట్టే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా ఈ విషయం ముందెన్నడూ ఆయన మాట్లాడలేదు. 

భోగాపురం ప్రారంభానికి సిద్ధం

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైజాగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని అప్పటి ప్రభత్వం నిర్ణయించింది. వైజాగ్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు నేవీ ఆధీనంలో ఉండటంతో అక్కడ పౌర విమానసేవలు నిర్వహించడానికి ఇబ్బందిగా మారింది. పైగా భద్రతా కారణాలు రీత్యా వైజాగ్ ఎయిర్పోర్టును సివిలియన్ ఎయిర్‌పోర్టుగా కొనసాగించడం మంచిది కాదని కేంద్ర ప్రభుచ్వం నిర్ణయించింది. అప్పుడు చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై భోగాపురం దగ్గర ఎయిర్‌పోర్టును ప్రతిపాదించారు. 2015లో అక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌరవిమానయాన శాఖ సాంకేతిక అనుమతినిచ్చింది. దీని కోసం అప్పటి ప్రభుత్వం 2700 ఎకరాలు సేకరించి పనులు ప్రారంభించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎయిర్‌పోర్టు విస్తీర్ణాన్ని 2000 ఎకరాలకు తగ్గించి.. పనులను GMRకి అప్పగించారు. జగన్ ప్రభుత్వ హయాంలో కొంత పనులు జరిగాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి  ఈ ఏడాది జనవరిలో ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు జూలైలో పూర్తిస్థాయి ఆపరేషన్స్‌కు సిద్ధం చేశారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget