News
News
వీడియోలు ఆటలు
X

G20 Summit: నేటి నుంచి విశాఖలో జీ20 సదస్సు - హాజరుకానున్న 57 మంది విదేశీ ప్రతినిధులు

G20 Summit: విశాఖపట్నంలో మార్చి 28, 29 తేదీల్లో జరగబోయే జీ20 సదస్సుకు 40 దేశాల నుంచి మొత్తం 57 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 

FOLLOW US: 
Share:

G20 Summit: జీ20 సదస్సుకు విశాఖపట్నం వేదికగా మారింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 28, 29 అంటే ఈరోజు రేపు నగరంలో జీ 20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సల్మాన్ ఆరోక్య రాజ్  తెలిపారు. రెండు రోజులు మొత్తం 7 సెషన్స్(మొదటి రోజు నాలుగు, రెండో రోజు 3), ఒక వర్క్ షాప్ జరుగుతాయని వెల్లడించారు. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. 28వ తేదీ సాయంత్రం గాళ డిన్నర్ కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతున్నారన్నారు. మొదటి రోజు నాలుగు, రెండవ రోజు మూడు సెషన్లు ఉంటాయన్నారు. 30న జీ 20 దేశాలు నుంచి వారికి ట్రైనింగ్ క్లాస్ లు ఉంటాయన్నారు. మిగతా దేశాలు వారు వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. 31వ తేదీన దేశ వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులతో సౌత్ కొరియా, సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలెజ్డ్ ఎక్సేంజ్ ఉంటుందన్నారు. పట్టణీకరణ ద్వారానే 80 శాతం జీడీపీ వస్తుందని సల్మాన్ ఆరోక్య రాజ్ తెలిపారు. జీడీపీ వృద్ధికి కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పపనపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.  

100 కోట్లతో వైజాగ్ సుందరీకరణ..

జీ - 20 సదస్సు నేపథ్యంలో విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు . అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు. ఎటుచూసినా అతిధులకు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. 

వైజాగ్ లో రెడ్ జోన్ గా ప్రకటించిన మార్గాలు ఇవే :
 
1)రాడిసన్ బ్లూ రిసార్ట్స్,
2)ముడసర్లోవ పార్క్,
3)కైలాసగిరి కొండ,
4)ఆర్.కె. బీచ్,
5)జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ రోడ్ 
6) ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధారలతో పాటు

G-20 సదస్సు కు హాజరుకానున్న ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో "తాత్కాలిక రెడ్ జోన్"గా ప్రకటించడమైనదని,ఈ నిషేధాన్ని ఉల్లంఘించి (డ్రోన్లు) సహా ఏవైనా సాంప్రదాయేతర వైమానిక వస్తువులు ఎగురవేసిన యెడల వాటిని నాశనం చేయడం తో పాటు ఐపీసీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని సీపీ  తెలిపారు. ఈనెల 28వ తేదీన గాలా డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయనీ, 29వ తేదీన ఉదయం యోగా కార్యక్రమం ఉంటుందనీ, జి-20 ప్రతినిధులు నగరంలో పలు ప్రాంతాలను సందర్శిస్తారనీ, అతిధులైన పలు దేశాల ప్రతినిధులు సందర్శించే రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రవేశం ఉండదనీ ప్రజలకు పోలీసులు సూచించారు. ప్రజలకు  అలానే సదస్సుకు హాజరయ్యే వారికి ట్రాఫిక్ లో అసౌకర్యం, అంతరాయం కలగకుండా ఈ  ఏర్పాట్లు చేశామని, కనుక ఈ నెల 28, 29, 30 తేదీలలో రాడిసన్ హోటల్ పరిసర ప్రాంతాలు, బీచ్ రోడ్, ఇతర జంక్షన్లు రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున నగరవాసులు పోలీసులకు సహకరిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి వైజాగ్ పోలీసులు తెలిపారు. 

Published at : 28 Mar 2023 09:28 AM (IST) Tags: AP News Visakhapatnam News G20 summit G20 News Beautification visakha

సంబంధిత కథనాలు

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

టాప్ స్టోరీస్

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్