Vizag Port Rice Smuggling: రూటు మార్చిన కేటుగాళ్లు, విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్
Andhra Pradesh News | ఏపీలో రేషన్ బియ్యం దందా ఇప్పుడు విశాఖ పోర్టుకు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. మంత్రి నాదెండ్ల తనిఖీలతో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు.
PDS Rice Seized at Vizag Port | విశాఖపట్నం: ఏపీలో కాకినాడ పోర్టుపై మంత్రులు, అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కేటుగాళ్లు రూటు మార్చారు. కాకినాడ పోర్టు మీద ఫోకస్ చేయడంతో విశాఖ పోర్టును స్మగ్లింగ్‌కు కేంద్రంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు
మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారంనాడు ఆయన విశాఖ పోర్టును ఆకస్మిక తనిఖీ చేశారు. కాకినాడ నుంచి తమ ఆటలు సాగడం లేదని రైస్ స్మగ్లర్లు వైజాగ్ పోర్టును కేంద్రం చేసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను సీజ్ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో రెండు నెలలుగా విశాఖ పోర్ట్‌ను బియ్యం స్మగ్లర్లు కేంద్రంగా ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా కాకినాడ పోర్టులో కోటి 38లక్షల మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖపట్నంలో దాదాపు 36వేల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని మూడు సంవత్సరాలలో ఎగుమతి చేశారని తెలిపారు. సుమారుగా అంచనా వేసుకుంటే అక్రమంగా తరలించిన బియ్యం విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో రేషన్ బియ్యం భారీగా ఎగుమతి
‘గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టు నుంచి ఏకంగా కోటి 38లక్షల మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం నుంచి దాదాపు 36వేల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని మూడేళ్లలో ఎగుమతి చేశారు. అక్రమంగా తరలించిన రేషన్ బియ్యం విలువ దాదాపుగా రూ.12వేల కోట్లు ఉంటుంది. కూటమి ప్రభుత్వం కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో గత రెండు నెలల కాలంలో విశాఖ పోర్టు నుండి 70వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించారు. ఇటీవల అధికారులతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్‌ను అలర్ట్ చేశాం. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాం. కాకినాడతో పాటు విశాఖ పోర్టులోనూ నిఘాను పెంచడంతో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.

త్వరలో అనకాపల్లిలో తనిఖీలు
త్వరలో అనకాపల్లిలో కూడా తనిఖీలు జరుపుతాం. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు ఉక్కుపాదంతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రేషన్ బియ్యం అక్రమాలను అరికడతాం. దాదాపుగా రూ.1 కోటి 48లక్షల కార్డుదారులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ రైస్ ప్రాక్ట్ ఆఫ్ ఇండియా పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. దాంతో రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సీఐడీ ద్వారా సిట్‌ను ఫామ్ చేశారు. విశాఖలో సీజ్ చేసిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌కు నివేదిక అందజేస్తాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు దాదాపు రూ.12,800 కోట్ల మేర ఖర్చు పెడుతున్నాం. రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి కాకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని’ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్