Floods Help Line Numbers: భారీ వర్షాల వేళ కంట్రోల్ రూం ఏర్పాటు, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఇవే
AP Flood Control Room: ప్రజలు వారి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

ఏపీలో ఇప్పటికే రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు కూడా తీవ్రమైన ముసురు పట్టి వర్షాలు కొనసాగుతాయనే అంచనా వేళ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఈ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. అన్ని జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
ప్రజలు వారి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 కు ఫోన్ చేసి తెలపాలని ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ నెంబర్లకు ఫోన్ చేసి సాయం పొందవచ్చని వెల్లడించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కంట్రోల్ రూం
భారీ వర్షాల నేపథ్యంలో కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో కూడా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. వరదల్లో చిక్కుకున్నవారు 9392919750 నెంబరుకు ఫోన్ చేయాలని కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాక, భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసులోనూ మరో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 0874 - 3232444 హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి భారీ వర్షాలు, వరదలకు ప్రభావితం అయినవారు సాయం పొందవచ్చని సూచించారు.
మరో రెండు నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు అనూప్ గఢ్, సికర్, గ్వాలియర్, సక్నా, పెండ్రా రోడ్, సెంటర్ గుండా వెళుతుంది. ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పమైన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఎత్తు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu language Dated 09.07.2022. pic.twitter.com/Szsla9sntu
— MC Amaravati (@AmaravatiMc) July 9, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

