ఎచ్చెర్ల ఈసారి ఎవరికి చిక్కేనో! రసకందాయంలో రాజకీయం
Etcherla Politics: శ్రీకాకుళం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం ఎచ్చెర్ల. సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి.
Etcherla Elections News: శ్రీకాకుళం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం ఎచ్చెర్ల. పరిశ్రమల ఖిల్లాగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో గెలుపు ఎప్పుడూ ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో 1,93,461 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 96,411 మంది పురుష ఓటర్లు, 97,034 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, టీడీపీ మరో ఆరుసార్లు విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొర్లె కిరణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
18సార్లు జరిగిన ఎన్నికలు
ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి 18 జరిగాయి. 1962లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కె పున్నయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1964లో జరిగిన ఎన్నికల్లో కె నరసయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కె నారాయణపై 7242 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సి సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎల్ లక్ష్మణదాస్‌పై 3065 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎల్ లక్ష్మణదాస్ తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అక్కయ్యనాయుడిపై 4419 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కె నరసయ్య విజయాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన 9791 ఓట్ల తేడాతో బి నరసింహులపై విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె ప్రతిభా భారతిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వెస్ నారాయణపై 25,152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె ప్రతిభా భారతిపై మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సి విజయలక్ష్మిపై 26,947 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె ప్రతభా భారతిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె మురళీ మోహన్‌పై 10,794 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె మురళీమోహన్ తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రతిభా భారతిపై 5689 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మీసాల నీలకంఠం నాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ సూర్యనారాయణరెడ్డిపై 15,015 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె కళా వెంకటరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన 4741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన గొర్లె కిరణ్ కుమార్ ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన 18,711 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు.
ఆరుసార్లు కాంగ్రెస్.. ఆరుసార్లు టీడీపీ విజయం
ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. తొలి రెండు ఎన్నికల్లో కె నరసయ్య కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కె ప్రతిభా భారతి ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 1983 నుంచి 1999 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆమె విజయాన్ని నమోదు చేశారు. గతంలో స్పీకర్‌గా ఈమె పని చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించిన కళా వెంకటరావు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన గొర్లె కిరణ్ కుమార్ విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.