అన్వేషించండి
Advertisement
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరో ప్రమాదం- రియాక్టర్ పేలి ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరో ప్రమాదం జరిగింది. ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగసి పడ్డాయి. ఈ దుర్గటనలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. రెండు రియాక్టర్లు పేలిన ఘటనలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న సాహితీ ఫార్మాటికల్ కంపెనీలో ఈ ఉదయం ప్రమాదం జరిగింది. రెండు రియాక్టర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరని చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన వాళ్లను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
ప్రమాదం సంగతి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఎగసిపడుతున్న అగ్ని కీలలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. గంటలతరబడి ఆ మంటలు అదుపులోకి రాలేదు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion