IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Jagan Vizag Tour: ఊరి వాకిటికి ఉపరాష్ట్రపతి వస్తేనే వెళ్ళని సీఎం జగన్- వైజాగ్ వెళ్లి హరియాణా సీఎంను కలవడం ఎందుకు ?

ఏపీ సీఎం జగన్ వర్సటైల్ అండ్ పెక్సులర్ పొలిటీషియన్. ఏ పని చేసినా ఓ లెక్క ఉంటుంది. అలాంటి జగన్... ప్రత్యేకంగా విశాఖ వెళ్లి మరీ.. హరియాణా సీఎంను కలుస్తుండటం పొలిటికల్ సర్కిల్‌లో ఇంట్రెస్ట్ పెంచుతోంది.

FOLLOW US: 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)... మంగళవారం..మధ్యాహ్నం హర్యాన సీఎం మనోహర్ లాల్(Haryana CM Manohar Lal Khattar ) ఖట్టర్‌ను విశాఖలో కలవనున్నారు. 

అందులో ఏమంది...? ప్రైవేటు పర్యటన కోసం వచ్చిన ఒక రాష్ట్ర సీఎంను... జగన్ కర్టసీగా కలుస్తున్నారు తప్పు ఏముంది...? అంటారా...?

ఆదివారం సాయంత్రం... విజయవాడకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు. ఈ ఆదివారమే కాదు.. జగన్ సీఎం అయ్యాక ఆయన చాలాసార్లు విజయవాడ వచ్చారు. కానీ ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి అయన్ను మర్యాదకు కూడా కలవలేదు.  

అంటే " వైస్ ప్రెసిడెంట్ వస్తే కచ్చితంగా సీఎం వెళ్లాల్సిందే..అది ప్రోటోకాల్ అని చెప్పడం కాదు ఇది.." 

హైప్రొఫైల్‌ ప్రోటోకాల్ వ్యక్తులు వచ్చినా కలవని ముఖ్యమంత్రి.... కేవలం.. "కర్టసీ" కోసం ఓ రాష్ట్ర సీఎంను పనిగట్టుకుని వెళ్లి కలుస్తున్నారా అని.. రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తి అంతే. 

అంటే సీఎం విశాఖ పర్యటన కేవలం సాధారణ భేటీ కోసం కాదు అని అర్థం అవుతుంది. పైగా ఆయన అధికారిక పర్యటనలో భాగంగా ఎలాగూ వైజాగ్ వచ్చాం అని ఆ సీఎంను మీట్ అవ్వడం లేదు. ప్రత్యేకంగా భేటీ కోసమే విశాఖ వస్తున్నారు కాబట్టి ఇంత పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవడం..!

ముఖ్యమంత్రి స్థాయిలో ఎవర్ని కలవాలి అనుకున్నా... వద్దు అనుకున్నా పూర్తిగా అది ఆయన ఇష్టం. అయితే ఇందులో కాస్త పొలిటికల్ టచ్ కనిపిస్తోంది కాబట్టి.. ఆ యాంగిల్‌లో చూస్తే  కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. 

మరి కొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక రాబోతోంది. దీనికి మద్దతు కూడగట్టే క్రమంలో మనోహర్ బీజేపీ ఆదేశాల మేరకు.. పర్యటనలు చేస్తున్నారా ..? లేక ఆయనే రాష్ట్రపతి అభ్యర్థి అవుతున్నారా అని అనుమానం కూడా ఉంది.

ఇక రెండో విషయం.. బీజేపీ ఎప్పటి నుంచో వైసీపీని ఎన్డీఏలో చేరాలని కోరుతోంది. అయితే స్థానికంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ దృష్ట్యా జగన్ దాన్ని సున్నితంగా తోసిపుచ్చుతూ వస్తున్నారు. బయట నుంచీ అన్ని విషయాల్లో మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అలాగే చేస్తున్నారు కూడా...! అయినా బీజేపీ ఒత్తిడి చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఏమైనా వచ్చారా అని సందేహాలు ఉన్నాయి. మనోహర్ ఖట్టర్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి సన్నిహితమైన నేత.. ఆయన ఇక్కడ ఐదు రోజులు ఉండి జగన్‌ను కలుస్తున్నారు అంటే... రాజకీయంగా ప్రాధాన్యత కనిపిస్తోంది. 

ప్రకృతి వైద్యానికి ఆంధ్రానా..?

నేచురోపతి ట్రీట్‌మెంట్‌ కోసం హరియాణా సీఎం ఆంధ్రాలో ఉన్నారు. విశాఖ బీచ్ రోడ్‌లో ఉన్న ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో ఆయన థెరపీ తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ చికిత్స కోసం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎక్కువుగా కేరళ, కర్ణాటక వెళ్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రావడం కూడా కొత్తే. ఆయన ఒక ఐదు రోజుల పాటు ఇక్కడ గడుపుతున్నారు. 

ఈ టైంలోనే జగన్ కలుస్తున్నారు. మొత్తానికి ఇది సాధారణ భేటీ కాదు అని.. ఏ రకంగా చూసినా అర్థం అవుతుంది. సాధారణంగా ఏ సీఎం అయినా వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు.. వారే ఆ రాష్ట్ర CM ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌లో జరుగుతుంది కాబట్టి రాజకీయంగా ఆసక్తి రేగుతోంది. 

అసలు ఈ భేటీ రాజకీయం కాకుండా.. ఏదైనా బిజినెస్ ప్రపోజల్‌కు సంబంధించినదో.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా అభివృద్ది ప్రాజెక్ట్ గురించీ కూడా కావొచ్చు. కానీ ఈ భేటీ మాత్రం ఆసక్తికరం.

Published at : 18 Apr 2022 07:12 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan VIZAG Manohar Lal Khattar Haryana CM Andhra Pradesh CM Jagan Haryana Cm manohar lal Khattar

సంబంధిత కథనాలు

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి