News
News
వీడియోలు ఆటలు
X

వైజాగ్ లో జీ -20 సదస్సు హడావుడి, రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు

వరుస కార్యక్రమాలతో అధికారులు బిజీ బిజీ

వైజాగ్ బ్రాండింగ్ కోసం ప్రయత్నాలు

ఈ నెల 28,29 తేదీల్లో జరగనున్న జి-20

FOLLOW US: 
Share:

 విశాఖలో ఈ నెల 28, 29 తేదీల్లో వైజాగ్ లో జీ -20 సదస్సు జరగనుంది. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. జీ-20 దేశాల ప్రతినిధులు చాలా నగరాల్లో ఈ మీటింగ్స్ జరుపుతున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సదస్సు జరపనుంది. వైజాగ్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. దీనికోసం జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు . 

బ్రాండ్ వైజాగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు

జీ -20 సదస్సును బేస్ చేసుకుని వైజాగ్ బ్రాండింగ్ కోసం కష్టపడుతోంది జీవీఎంసీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు వైజాగ్ వాసులను కూడా జీ -20 సదస్సులో పార్ట్నర్లను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే బోట్ రేసింగ్ , కైట్ ఫెస్టివల్ లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటికే నిర్వహించింది. వీటితోపాటు ఈ వీకెండ్ లో  కార్నివాల్ , మారథాన్ లను కూడా జరపనున్నారు. అలాగే  వ్యర్ధ పదార్థాలతో కళాఖండాల ఫెస్టివల్ ను కూడా నిర్వహించనున్నారు . వీటిలో పాల్గొనేలా వైజాగ్ వాసులను ఎంకరేజ్ చేస్తుంది జీవీఎంసీ . దీనిని  "జన్ భాగిదారీ " ప్రోగ్రామ్ గా పిలుస్తున్నారు. 

100 కోట్లతో వైజాగ్ సుందరీకరణ

 జీ - 20 సదస్సు నేపథ్యంలో విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు . అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు . ఎటుచూసినా అతిధులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు . అలాగే సదస్సు జరిగే ఆ రెండు రోజులూ అంటే 28,29 తేదీలలో వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి . దీనికి సహకరించాలి అని పోలీసులు వైజాగ్ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Published at : 24 Mar 2023 08:48 PM (IST) Tags: AP News VIZAG G20 summit G20 VisakhaPatnam Beautification works

సంబంధిత కథనాలు

యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ

యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ

Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు

Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

టాప్ స్టోరీస్

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?