అన్వేషించండి

YS Jagan Tour Cases: జగన్ గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమణ; ఐదుగురు వైసీపీ కీలక నేతలపై కేసులు

YS Jagan Tour Cases: వైఎస్ జగన్ చేపట్టిన గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమించారని పోలీసులు కేసులు పెట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో ఐదుగురు వైసీపీ నేతలను నిందితులుగా చేర్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించారు.
  • పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కింద ఐదుగురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
  • ర్యాలీల వల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయి, ప్రజలు ఇబ్బంది పడ్డారు.

YS Jagan Tour Cases: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం గుంటూరులో పర్యటించారు. తమ పార్టీ లీడర్ అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించారు. ఈ పర్యటనలో భాగంగా నిబంధనలను, పోలీస్‌ ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా భారీ ర్యాలీలు నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసులు పెట్టారు. ఇందులో ఐదుగురు కీలక నేతల పేర్లను ప్రస్తావించారు. 

పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కింద కేసులు 

గుంటూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలులో ఉన్న పోలీస్ యాక్ట్‌ సెక్షన్ 30ని వైసీపీ నేతలు బహిరంగంగా ఉల్లంఘించినట్టు పోలీసులు నిర్దారించారు అనుమతి లేకుండా భారీ కాన్వాయ్‌లతో ర్యాలీలు నిర్వహించడం పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయం వంటి చర్యలు పాల్పడినందుకు ఐదు వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో ఈ కేసులు నమోదు అయ్యాయి. 

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత కీలక నేత దొంతిరెడ్డి వేమారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు నూనె ఉమామహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో బలసాని కిరణ కుమార్ నిందితుడిగా కేసు నమోదు అయ్యింది. నగరంపాలెం పోలీస్ స్టేషన‌లో వైసీపీ నేత నూరి ఫాతిమాపై ఈ స్టేషన్‌లో    కేసు పెట్టారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడైన అంబటి మురళిపై కేసు ఫైల్ అయ్యింది. 

జగన్ పర్యటన సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా 40 నిమిషాల్లో ముగియాల్సిన గుంటూరు ప్రయాణం వైసీపీ నేతల తీరు కారణంగా ఐదు గంటల పాటు సాగిందని అంటున్నారు. జాతీయ రహదారిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వాహనాలను నిలపడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని వల్ల నిత్యవసర వస్తువుల రవాణా, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే అంబులెన్స్‌లు కూడా ఇబ్బందులు పడ్డట్టు చెబుతున్నారు. 

Frequently Asked Questions

వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా పోలీసులు ఏ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు పెట్టారు?

పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ను ఉల్లంఘించినందుకు, అనుమతి లేకుండా భారీ ర్యాలీలు నిర్వహించినందుకు కేసులు పెట్టారు.

జగన్ పర్యటన వల్ల ఎవరికి ఇబ్బందులు కలిగాయి?

జగన్ పర్యటన వల్ల ప్రజలు, నిత్యవసర వస్తువుల రవాణా, అత్యవసర వైద్య సేవలకు వెళ్లే అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.

గుంటూరులో జగన్ పర్యటనలో భాగంగా ట్రాఫిక్ ఎంతసేపు జామ్ అయింది?

సాధారణంగా 40 నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం, వైసీపీ నేతల తీరు కారణంగా ఐదు గంటల పాటు సాగింది.

ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయి?

దొంతిరెడ్డి వేమారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా, మరియు అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget