News
News
X

Uma Chits Case: ఉమా చిట్స్ బాధితులకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం, 11 ఏళ్ల తరువాత పరిహారం

2012లో ఉమా చిట్స్ వ్యవహరం విజయవాడ నగరంలో సంచలనం రేపింది. బాధితులకు పరిహారం ఇప్పించేదిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

FOLLOW US: 
Share:

బెజవాడలో సంచలనం రేకెత్తించిన ఉమా చిట్స్ వ్యవహరంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. 2012లో ఉమా చిట్స్ వ్యవహరం విజయవాడ నగరంలో సంచలనం రేపింది. బాధితులకు పరిహారం ఇప్పించేదిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దశాబ్దం తరువాత...
ఉమా చిట్ ఫండ్‌ కేసును వేగవంతం చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు సచివాలయంలోని తన ఛాంబర్లో  సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ క్రాంతి రాణా టాటా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడ్డం రవి కిషోర్ పాల్గొన్నారు. 2012 నుంచి కేసు పెండింగ్ లో ఉందని.. ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగే విధంగా చొరవ చూపాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు హోం మంత్రి తానేటి వనిత ను కోరారు. బాధితులందరిని ఆదుకుంటామని.. ఈనెల 17 నుంచి కేసుకు సంబంధించిన విచారణ మొదలవుతుందని మంత్రి తానేటి వనిత తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్నారు. ఉమా చిట్స్ ఆస్తులు అమ్మకానికి పెట్టి బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ 9న మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు మంత్రి తానేటి వనిత తెలియజేశారు.
అప్పట్లో సంచలనం....
ఉమా చిట్స్ అంటేనే బెజవాడ వాసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఘటన. 2012సంవత్సరంలో ఈ సంఘటన వెలుగు లోకి వచ్చింది. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఉమామహేశ్వరరావు ఉమా చిట్స్ ను నిర్వహించారు. చిట్స్ నిబందనలకు పూర్తిగా విరుద్దంగా చాలా మంది వద్ద లక్షల రూపాయలు సేకరించారు. అలా సేకరించిన నిదులతో పెద్ద ఎత్తున రిసార్ట్స్ ను నిర్వహించారు. చాలా చోట్ల పెట్టుబడులు పెట్టి అవి నష్టపోయినట్లుగా చూపించారు. అనేక చోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. వాటిని దాచిపెట్టి బాధితులకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దీంతో పెద్ద ఎత్తున బాదితులు అప్పటి విజయవాడ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో బాదితులు క్యూ కట్టి మరి ఉమా చిట్ ఫండ్స్ పై ఫిర్యాదు చేశారు.ఆర్దిక మోసం కింద కేసులు నమోదు చేశారు. ఉమా చిట్స్ అదినేత ఉమా మహేశ్వరరావు ను కూడ పోలీసులు తరువాత కాలంలో అరెస్ట్ చేశారు.
ఆస్తులు విక్రయించి బాధితులకు పరిహారం
ఉమా చిట్స్ అనగానే మోసపోయిన బాధితులకు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ వ్యవహరం అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారింది. నిర్వాహకులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు అండగా నిలబడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తామని అప్పటి కాంగ్రెస్ నేత, ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లాది విష్ణు హామి ఇచ్చారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఉమా చిట్స్ కు సంబంధించిన ఆస్తులను కోర్టుకు వివరించి వాటిని విక్రయించటం ద్వారా బాధితులకు ఇవ్వాల్సిన నగదును తిరిగి చెల్లించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల పక్షాన హోం మంత్రి తానేటి వనితతో పాటుగా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమా చిట్స్ కు సంబంధించిన ఆస్తుల విలువ ప్రస్తుతం కోట్లలో ఉండటంతో వాటిని విక్రయించి.. బాధితులను ఆదుకోవటానికి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిగణనలోకి తీసుకుంటామని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.

Published at : 15 Mar 2023 08:02 PM (IST) Tags: AP News Taneti Vanitha Vijayawada AP Updates Uma Chits Uma Chit Funds

సంబంధిత కథనాలు

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Four MLAS : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?

Four MLAS :  ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?

మత మార్పిడి రిజర్వేషన్ల తీర్మానం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు: సోము వీర్రాజు

మత మార్పిడి రిజర్వేషన్ల తీర్మానం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు: సోము వీర్రాజు

ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్

ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్

YSR Asara Scheme: పది రోజుల పాటు ఆసరా ఉత్సవాలు- అక్కచెల్లెమ్మలు అండగా ఉండాలన్న సీఎం జగన్

YSR Asara Scheme: పది రోజుల పాటు ఆసరా ఉత్సవాలు- అక్కచెల్లెమ్మలు అండగా ఉండాలన్న సీఎం జగన్

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?