By: ABP Desam | Updated at : 02 Dec 2022 03:09 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Vijayawada RMP Doctor News: విజయవాడలో (Vijayawada) ఓ మహిళ ఆర్ఎంపీ డాక్టర్ (Woman RMP) గా చెలామణి అవుతూ చేస్తున్న పాడు పని వెలుగులోకి వచ్చింది. పైకి మాత్రం ఆర్ఎంపీ వైద్యురాలిగా అందరికీ వైద్యం చేస్తూ ఎంతో గౌరవాన్ని సంపాదిస్తోంది. తెర వెనుక మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇన్నాళ్లూ ఆమె చుట్టు పక్కల వారు, తెలిసిన వారి దృష్టిలో ఆర్‌ఎంపీగా చెలామణి కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి యువతులను విజయవాడ (Vijayawada) నగరానికి రప్పించి ఈమె వారితో వ్యభిచారం చేయిస్తూ ఉంది. ఆ ఆర్ఎంపీ డాక్టర్ గురించి పోలీసులకు సమాచారం అందడంతో భవానీపురం పోలీసులు (Bhavanipuram Police) ప్రత్యేక ప్లాన్ అమలు చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భవానీపురం ప్రాంతంలో ఆ మహిళ నివాసం ఉంటోంది. ఆమె భర్త కూడా ఆర్‌ఎంపీగానే పని చేసేవారు. గతంలో కొవిడ్ సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఆర్‌ఎంపీగా అవతారం ఎత్తింది. భర్త దగ్గర నేర్చుకున్న వైద్యంతో చుట్టుపక్కల వారికి వైద్యం చేసేది. ఇంటి వద్దకు వచ్చిన వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది.
Also Read: చంద్రబాబుకు వెంకటేశ్వరస్వామి శాపం, ఆయన్ని చంపాల్సిన అవసరం మాకేంటి? - పేర్ని నాని వ్యాఖ్యలు
ఎవరైనా ఆమెకు దగ్గరైతే తన వద్ద అమ్మాయిలు ఉన్నారని కావాలంటే పంపిస్తానంటే చెప్తుంది. హైదరాబాద్‌తో (Hyderabad) పాటు పలు ప్రాంతాల నుంచి ఆమె యువతులను రప్పిస్తుంది. ఆమె చేస్తున్న వ్యాపారం భవానీపురం సీఐ (Bhavanipuram CI)ఉమర్ కి తెలియడంతో ప్లాన్ వేశారు. ఓ యువకుడితో గత నెల 30వ తేదీన ఆమె వాట్సాప్‌కు మెసేజ్ పంపారు. తనకు అమ్మాయి కావాలంటూ ఆ యువకుడు వాట్సప్ లో కోరాడు. యువతి దగ్గరికి వెళ్లాలంటే రూ.10 వేలు ఫీజు అవుతుందని ఆమె చెప్పింది.
ముందు తనకు రూ.5 వేలు ఇవ్వాలని, తర్వాత మరో రూ.5 వేలు యువతిని కలిశాక ఆమెకు ఇవ్వాలంటూ చెప్పింది. దానికి సరేననడంతో ఆ యువకుడిని గొల్లపూడి హైస్కూలు (Gollapudi High School) వద్దకు రావాలంటూ మహిళ చెప్పింది. అక్కడ ఆమెకు అతడు రూ.5 వేలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు సమీపంలోని హోటల్‌లో ఉన్న యువతికి ఇవ్వాలంటూ రూం నెంబరు చెప్పింది. అలా భవానీ పురం పోలీసులు (Bhavanipuram Police) రంగ ప్రవేశం చేసి నిర్వహకురాలిని అరెస్టు చేశారు. గదిలో ఉన్న యువతిని ప్రశ్నించగా తాను పశ్చిమ్ బెంగాల్ (West Bengal) నుంచి వచ్చినట్లు చెప్పింది. ఆమెను స్త్రీ సంక్షేమ గృహానికి తరలించి, ఆర్ఎంపీ గా పని చేస్తున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Mangalagiri NRI Hospital : మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ఐటీ శాఖ సోదాలు - ఆ ఆస్పత్రి ఎవరిదంటే ?
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ