Vjiayawada Hijab Row: విజయవాడలోనూ హిజాబ్ వివాదం - వెంటనే పరిష్కారం !
విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో కొద్ది సేపు హిజాబ్ వివాదం కలకలం రేపింది. మొదట విద్యార్థులను అడ్డుకున్న ప్రిన్సిపల్ తర్వాత అనుమతించారు.
కర్ణాటకలోని మొదలైన హిజాబ్ వివాదం ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో ఉదయం విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్న సమయంలో కొంత మందిని అడ్డుకున్నారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్, బురఖాలను ధరించిన వారిని క్లాసుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.అయితే తాము ఫస్ట్ ఇయిర్ నుండి బుర్కాలోనే కాలేజీ వెళ్తున్నామని, కాలేజీ ఐడీ కార్డులో కూడా తాము బుర్కాతోనే ఫోటో దిగామని విద్యార్థినిలు తెలిపారు. విషయం తెలిసిన ముస్లిం పెద్దలు కాలేజీ వద్దకు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరిపారు.
#HijabRow spreads to #AndhraPradesh .
— P Pavan (@PavanJourno) February 17, 2022
Students of Loyola College in #Vijayawada said they were denied entry.
Students said they had ID cards in #Burqa and never faced issues since 1st year.
Parents, community elders in talks with college principal & police.#Hijab pic.twitter.com/RDspno28R9
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్ అత్యుత్సాహంతోనే వివాదం చోటు చేసుకుందని, ఉద్దేశపూర్వకంగా విద్యార్ధిలను అడ్డుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. చివరకు ముస్లీం పెద్దల చర్చలతో వివాదం సమసిపోవడంతో విద్యార్ధినిలను యాజమాన్యం క్లాస్ రూంలోకి అనుమతించింది. అందర్నీ క్లాసుల్లోకి అనుమతించామని ఎవర్నీ అడ్డుకోలేదని ప్రిన్సిపల్ మీడియాకు తెలిపారు.ఏపీలో ఇంత వరకూ ఎక్కడా హిజాబ్ వివాదం ఎదురు కాలేదు. కానీ అనూహ్యంగా విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ప్రిన్సిపల్ ఉద్దేశపూర్వకంగా వివాదం రేపడానికి ప్రయత్నించారాన్న ఆరోపణలు వచ్చాయి.
Secularism on display in Hijab support: శభాష్ అనిపిస్తున్న ఆత్మకూరు ప్రజలు
అయితే వెంటనే సద్దుమణిగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్ర లయోలా కాలేజీ ఓ మత ట్రస్ట్ కింద నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ అందరికీ అడ్మిషన్లుఇస్తారు. ఎవరి నమ్మకానికి తగ్గట్లుగా వారు డ్రెస్సింగ్‌తో వస్తారు. ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. కర్ణాటక వివాదం కారణంగా ఇప్పుడీ ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీగా చేస్తారా? బీజేపీ దమన నీతితో దేశం అల్లకల్లోలం : సీఎం కేసీఆర్
ప్రస్తుతం ఏపీలోని ఏ విద్యా సంస్థ కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదు. విద్యార్థులందరూ తమ తమ నమ్మకాలకు తగ్గట్లుగా వస్త్రధారణతో విద్యా సంస్థలకు హాజరవుతున్నారు. గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. వివాదం పెద్దది కాకుండా కాలేజీ యాజమాన్యం, విద్యార్థినుల తల్లిదండ్రులు చురుకుగా వ్యవహరించడంతో సమస్య పరిష్కారం అయింది.