News
News
X

Vja Murder Case : బెజవాడలో బిల్డర్ మర్డర్ కేసులో ఏడాది తర్వాత తేలిన అసలు నిజం - హంతకులు వాళ్లే !

విజయవాడలో గత ఏడాది జరిగిన బిల్డర్ రాజు హత్య కేసు మిస్టరీ వీడింది. హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 
 
Vja Murder Case : బెజవాడలో సంచలనం రేకెత్తించిన బిల్డర్ రాజు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 30 గ్రాముల బంగారంతో పాటుగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం అక్టోబర్ 31 తేదీ అర్ధరాత్రి సమయంలో శాంతినగర్, దేవినేని గాంధీపురం కు చెందిన పీతల అప్పలరాజు  అలియాస్ బిల్డర్ రాజు తాను ఉంటున్న ఇంటిలో తలపై గాయాలతో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఏడాది తర్వతా వీడిన బిల్డర్ రాజు మర్డర్ మిస్టరీ

సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనుమానితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.హతుడు పీతల అప్పలరాజు @ బిల్డర్ రాజు విశాఖపట్నం నివాసి, ఇతను బిల్డింగ్ పనుల నిమిత్తం విజయవాడ దేవినగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో హతుని వద్ద తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న కొటారి సాయి కుమార్ (39 సం.) తో పరిచయం ఏర్పడి ఒంటరిగా ఉంటున్న హతునికి సాయి కుమార్ భోజన ఏర్పాట్లు చూసేవారు. ఈ క్రమంలో సాయికుమార్ అద్దెకు ఉంటున్న ఇంటి పైకి హతుడు అద్దెకు దిగాడు. సాయి కుమార్ భార్య సుధా రేవతి కూడా రాజు  బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం అలాగే టిఫిన్, భోజనం వండడం, వాటిని పైకి తీసుకుని వెళ్లి రాజు కి వడ్డించేది. 

ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి భార్యపై కన్నేసిన బిల్డర్ రాజు 

News Reels

ఈ క్రమంలో హతుడు రేవతి ని కోరిక తీర్చమని ఇబ్బంది పెడుతూండేవాడు.  ఈ విషయం సాయికుమార్ భార్య తన భర్తతో చెప్పింది. వేధింపులు ఎక్కువ కావడంతో భర్త సాయి కుమార్ కుటుంబ సభ్యులు భవాని శంకర్, శివపార్వతి, చూడామణి లకు చెప్పిన,సాయి కుమార్  బిల్డర్ రాజును చంపాలని నిర్ణయించుకున్నారు.అయితే హతుడు రాజు బలంగా ఉంటారు, కాబట్టి ప్రతిఘటిస్తే ఎలా అని ఆలోచన చేశారు. సమయంలో విషం పెట్టి చంపేద్దాము అని శివపార్వతి, చూడామణి సలహా ఇచ్చారు. వెంటనే వారి సలహా మేరకు ఎలకల మందు కొని భోజనంలో కలిపి రాజుకు రేవతి ద్వారా పంపించారు. హతుడు రాజు తిన్న తరువాత మత్తులోకి జారుకుని ఉండటంతో అదే అదునుగా చేసుకుని సాయి కుమార్ మరియు భవాని శంకర్లు ఇంటిలోకి ప్రవేశించి ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. 

కుటుంబసభ్యులందరితో కలిసి చంపేందుకు సాయికుమార్ ప్లాన్

హతుడు ప్రతిఘటించడానికి ప్రయత్నించిన సమయంలో రేవతి, హతుని కాళ్ళు పట్టుకుని కదలకుండా సహకరించింది. చనిపోయాడు అని నిర్ణయించుకున్న తరువాత ఆనవాళ్ళు కనబడకుండా ఉండేందుకు ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు.విచారణ క్రమంలో నిందితుల కదలికలు అనుమానంగా ఉండటంతో మరియు వీరిపై ప్రత్యేక బృందాలు మరింత లోతుగా వివరాలను సేకరిస్తున్న సమయంలో,పూర్తి సమాచారం మేరకు విచారణ జరిపి నిందితులు దేవినేని గాంధీపురం ప్రాంతానికి చెందిన వారందర్నీ అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను మరియు చోరి చేసిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Published at : 31 Oct 2022 05:56 PM (IST) Tags: Crime News Vijayawada Builder Raju's murder Bejawada News

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

తెలంగాణలో ఐటీ సోదాల ప్రకంపనలు - ఈసారి వంశీరామ్‌ బిల్డర్స్‌పై అధికారుల కన్ను

తెలంగాణలో ఐటీ సోదాల ప్రకంపనలు - ఈసారి వంశీరామ్‌ బిల్డర్స్‌పై అధికారుల కన్ను

అప్రియమైన సీఎం జగన్‌- ట్విటర్ వేదికగా లోకేష్‌ పంచ్‌లు- 24 గంటల డెడ్‌లైన్

అప్రియమైన సీఎం జగన్‌- ట్విటర్ వేదికగా లోకేష్‌ పంచ్‌లు- 24 గంటల డెడ్‌లైన్

దేవినేని అవినాష్‌, వల్లభనేని వంశీ ఇళ్లపై ఐటీ దాడులు- వంశీరామ్‌ బిల్డర్స్‌తో సంబంధాలపై ఆరా

దేవినేని అవినాష్‌, వల్లభనేని వంశీ ఇళ్లపై ఐటీ దాడులు- వంశీరామ్‌ బిల్డర్స్‌తో సంబంధాలపై ఆరా

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక- ఈనెల 8 నుంచి వర్షాలు!

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక-  ఈనెల 8 నుంచి వర్షాలు!

టాప్ స్టోరీస్

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!