Vijayawada MP Nani: వైసీపీలోకి ఎంపీ కేశినేని నాని, సాయంత్రం సీఎం జగన్ ను కలిసే ఛాన్స్!
Vijayawada MP : విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరిక ఖాయమైంది. ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇవాళ సాయంత్రం కలవనున్నారు.
Kesineni Nani Look Into YSRCP: విజయవాడ (Vijayawada) ఎంపీ (Mp) కేశినేని నాని వైసీపీ (YSRCP)లో చేరిక ఖాయమైంది. ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)ని ఇవాళ సాయంత్రం కలవనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేశారు. కేశినేని నాని ఎంపీ పదవికి, ఆయన కూతురు శ్వేత కార్పొరేటర్ పదవికి గుడ్ బై చెప్పారు. విజయవాడ పార్లమెంట్ సీటును తెలుగుదేశం పార్టీ కేశినేని చిన్నికి ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని పార్టీ నేతలు నాని చెప్పారు. దీంతో మనసు నొచ్చుకున్న కేశినేని నాని...టీడీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీ పదవి రాజీనామాను స్పీకర్ ఓం బిర్లా ఆమోదించాల్సి ఉంది.
విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని
వచ్చే ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంపీ సీటుతో పాటు తన కూతురికి ఎమ్మెల్యే సీటు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి వైసీపీ హైకమాండ్ కూడా ఒకే చెప్పడంతోనే...ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు కేశినేని నాని.
కొంతకాలంగా జగన్ పై ప్రశంసల జల్లు
కేశినేని నాని కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు పాల్గొనే బహిరంగసభల్లో పాల్గొనడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై కొంతకాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరును కొనియాడారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, నేతలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలో సొంత గ్రూపులను నడిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నియమించిన ఇన్ చార్జ్ లను కాదని, తన గ్రూపు నేతలతో కలిసి కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించడం, వైసీపీ పనితీరును బాగుందని వ్యాఖ్యానించడం...తెలుగుదేశం పార్టీకి ఆగ్రహం తెప్పింది.
కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలు
విజయవాడ పార్లమెంట్ బాధ్యతలను కేశినేని నాని సోదరుడు చిన్నికి అప్పగించింది. నానికి సమాంతరంగా చిన్ని కూడా నియోజకవర్గంలో పని చేసుకుంటూ వెళ్లిపోయారు. పార్టీ అధిష్ఠానం సూచనలతో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు చిన్నికి సహకరించారు. తనకు చెప్పకుండా చిన్నికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడం, ప్రత్యర్థిగా భావించే చిన్ని నియమించడంపై నాని బహిరంగంగానే టీడీపీ నేతలను విమర్శించారు. ఒక దశలో కంట్రోల్ తప్పి మాట్లాడారు. అయినప్పటికి తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నానిపై విమర్శలు చేశారు. పార్టీపై అలకతో ఉన్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ హైకమాండ్, ఎంపీ కనకమేడల రవింద్రకుమార్ ద్వారా బుజ్జగించేందుకు ప్రయత్నించింది. రవింద్రకుమార్ మాటలకు మెత్తబడని కేశినేని నాని...చెప్పినట్లే ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.