YS Jagan Injured: ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి, ఎడమ కంటిపైన గాయం - చంద్రబాబు చేయించారని వైసీపీ మండిపాటు
AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో ఊహించని ఘటనతో అంతా షాకయ్యారు. ఓ ఆగంతకుడు రాయితో దాడి చేయడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎడమ కంటి పైన గాయం కావడం కలకలం రేపింది.
Stone pelted at CM YS Jagan while on his bus yatra in Vijayawada- విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ గుర్తుతెలియని ఆగంతకుడు రాయితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర (YS Jagan Bus Yatra) చేస్తున్నారని తెలిసిందే. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సీఎం జగన్ పై రాయి విసిరాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి పైన గాయమైంది. కనుబొమ్మపైన గాయమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లికి సైతం గాయమైనట్లు సమాచారం. సీఎం జగన్ పై దాడి కావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇది కచ్చితంగా టీడీపీ నేతల పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అసలైం జరిగింది..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని రాయి పెట్టి కొట్టాడు. పూల మాటున వచ్చిన రాయి నేరుగా జగన్ కంటి పైన తగలింది. రాయి ఫోర్స్‌గా తగలటంతో జగన్ ఎడమ కంటిపైన గాయమైంది. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమ్తతమై సీఎం జగన్ ను ప్రొటక్ట్ చేశారు. బస్సులోపలికి తీసుకువెళ్లి జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స తర్వాత జగన్ అనంతరం రోడ్ షో కొనసాగించారు. అయితే ఎవరు దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కార్యకర్తలు పూలు జల్లుతున్నట్లు చల్లుతూ వాటి మాటున రాయి పెట్టి విసిరినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జగన్ మాత్రం గాయమైనా రోడ్ షో ఆపకుండా కొనసాగించాలని నిర్ణయించారు.
చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు..
విజయవాడలో సీఎం జగన్‌పై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ పార్టీ ఆరోపించింది. మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య అని జగన్ పై జరిగిన రాయి దాడిని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారని సూచించారు.
విజయవాడలో మన నాయకుడు సీఎం @ysjagan గారిపై పచ్చ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు.
— YSR Congress Party (@YSRCParty) April 13, 2024
ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక @JaiTDP పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య.
రాష్ట్రవ్యాప్తంగా @YSRCParty కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ… pic.twitter.com/kqfWhkc7Nq