అన్వేషించండి

APPSC Group 1 Scam: ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ వాల్యుయేషన్ స్కామ్ కేసులో కీలక పరిణామం

Andhra Pradesh Group 1 Exam | ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల వాల్యుయేషన్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన అనంతరం సతీష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

Remand for Dhatri Madhu : విజయవాడ: వైసీపీ హయాంలో జరిగిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల వాల్యుయేషన్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల వాల్యువేషన్లో పాల్గొన్న సతీష్ అనే నందిగామకు చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడ్ని విజయవాడ స్వర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఏ2గా ఉన్న క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధుకు విజయవాడ కోర్టు మే 21వరకు రిమాండ్‌ విధించింది.

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షల అక్రమాల కేసులో సతీష్ ను పోలీసులు ఇటీవల రెండు రోజుల పాటు విచారించారు. విచారణకు వెళ్లి వచ్చిన రెండో రోజు నందిగామకు చెందిన సతీష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. సతీష్ ఆత్మహత్యాయత్నం విషయాన్ని బయటకు రాకుండా పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు సీక్రెట్‌గా ఉంచారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో వాల్యూ వేషన్లో పాల్గొన్న 60 మందిని పోలీసులు విచారించారు. సతీష్ గతంలో నందిగామలో ఓ ప్రవేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశాడని సమాచారం. 

ఏపీ గ్రూప్‌-1 మూల్యాంకనం కేసులో ధాత్రి మధుకు రిమాండ్‌
రాష్ట్ర గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్రూప్ 1 స్కామ్ కేసులో ఏ2గా ఉన్న క్యామ్‌సైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ మధుసూదన్‌ (ధాత్రి మధు) డైరెక్టర్‌గా ఉన్నారు. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి, ఐపీఎస్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ వాల్యుయేషన్లో భారీ అక్రమాలకు క్యామ్‌సైన్‌ తెరలేపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. హాయ్‌ల్యాండ్‌ వేదికగా మాన్యువల్‌ మూల్యాంకనమే చేపట్టలేదని గుర్తించారు. కానీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు మూల్యాంకనం చేసినట్లుగా నమ్మించేందుకు అర్హత లేని వ్యక్తులను తాత్కాలికంగా నియమించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే వాల్యుయేషన్ గురించి ఏమాత్రం అవగాహన లేని గృహిణులు, చంటి బిడ్డల తల్లులను పేపర్ల వాల్యుయేషన్ కోసం తాత్కాలికంగా నియమించుకుని నాటకం ఆడటంతో కథ అడ్డం తిరిగిందని అధికారులు తెలిపారు. జవాబు పత్రాలను తాము కనీసం తెరిచి చూడలేదని, క్యామ్‌సైన్‌ మేనేజ్‌మెంట్ చెప్పిన విధంగా మార్కులు మాత్రమే వేసినట్లు వాల్యుయేషన్ చేసిన కొందరు విచారణలో ఒప్పుకున్నారని సమాచారం. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10 లోని క్యామ్‌సైన్‌ ఆఫీసులో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు మధుసూదన్‌ (ధాత్రి మధు)ను మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం అతడిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. మరుసటిరోజు విజయకోర్టులో ప్రవేశపెట్టగా రెండు వారాలపాటు రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ జైలుకు మధుసూదన్‌ను తరలించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP 10th class exam Dates: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
Four Labour Codes: కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
Sathya SaiBaba guests: వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
Tejas Fighter Jet :దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
Advertisement

వీడియోలు

Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
India vs South Africa 2nd Test | రేపటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్
India vs South Africa ODI | రోహిత్, కోహ్లీ రీఎంట్రీ !
World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌
IPL Auction 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP 10th class exam Dates: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
Four Labour Codes: కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
Sathya SaiBaba guests: వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
Tejas Fighter Jet :దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
Jagan letter to Chandrababu: కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
KTR Vs Revanth Reddy:
"నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు" కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు 
Rajamouli : రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... RGV సెన్సేషనల్ కామెంట్స్
రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... RGV సెన్సేషనల్ కామెంట్స్
Deekshith Shetty : రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
Embed widget