By: ABP Desam | Updated at : 20 Jul 2022 11:47 AM (IST)
కేశినేని చిన్ని
సోదరుడు, టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ చిల్లర వివాదంలోకి తన కుటుంబాన్ని లాగడం బాధాకరం అని కారు వివాదంపై కేశినేని చిన్ని అన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు తనను ఆపారని, పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలుతుందని, పార్టీలో తాను చిన్న కార్యకర్తనని, టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావడమే తమ లక్ష్యమన్నారు. కేశినేని నాని మాకు శత్రువు కాదు.. మా సొంత అన్న అని, తాను కేవలం పార్టీలో సాధారణ కార్యకర్తనని చెప్పారు.
ఎన్టీఆర్ శత జయంతిపై సైతం వివాదమేనా..
పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎవరినీ టిక్కెట్ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ఏ తప్పు చేసినా ఈపాటికే బయటకొచ్చేదని, కానీ ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చిందని కేశినేని చిన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను వాడే కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదన్నారు. ఆటోనగర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించినా.. దాన్ని కూడా వివాదాల్లోకి లాగారని తెలిపారు.
పోలీసులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు..
హైదరాబాద్ పోలీసులు విచారణ చేపట్టినా, నా కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పారు. అయితే తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ, ఎలాంటి రాజకీయపరమైన కారణం కాదన్నారు. తన మీద విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని స్వాగతిస్తానని.. కానీ ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదని సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే, సోదరుడు కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.
ఎంపీ నాని ఫిర్యాదుతో కేసు నమోదు..
మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు, ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420, 416, 415, 468, 499 35 3534 80 (ఎఫ్ఐఆర్ 523/2022) నమోదు చేశారు. అయితే ఇదే వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు. అయితే ఈ వాహనం కేశినేని జానకి లక్ష్మి పేరు మీద ఉంది. దీన్ని ఆమె భర్త కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. కేశినేని చిన్ని స్వయంగా నానికి సోదరుడు కావటం విశేషం. చిన్ని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సొంత సోదురుడి పైనే ఫిర్యాదు చేయడంతో ఎఐఫ్ఆర్ నమోదు కావడం, పోలీసులు విచారణ చేయడంతో ఈ వ్యవహరం అంతా ఆలస్యంగా బయటకు వచ్చి టీడీపీలో చర్చనీయాశంగా మారింది.
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ ను పొడగింపు- పిటిషన్‌పై తీర్పులు మధ్యాహ్నానికి వాయిదా
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్
Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా
Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు
/body>