అన్వేషించండి

Kadambari Jethwani: ఎప్పుడైనా లారీలతో తొక్కించేస్తారు- ప్రభుత్వమే కాపాడాలి- ఏబీపీ దేశం ముందు బోరుమన్న జత్వాని

Andhra Pradesh: సంచలనంగా మారిన ఓ హీరోయిన్ కేసు ఏపీ రాజకీయాలు షేక్ చేస్తోంది. రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందో ఏపీబీ దేశంతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు కాదంబరి జత్వాని.

Kadambari Jethwani Talk With ABP Desam : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓ హీరోయిన్ కేసు ఏపీ రాజకీయాలు షేక్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని అధికార యంత్రాంగం ఇందులో భాగమై ఉందన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ నెల రోజులు ఏం జరిగిందో బాధితురాలు కాదంబరి జత్వాని ఏపీబీ దేశంతో మాట్లాడారు. ఏబీపీ దేశం ఎడిటర్ నాగేశ్వరరావు ఆమెను ఇంటర్వ్యూ చేసి ఆమె డిామాండ్స్ ఏంటీ ఇందులో ఎవరెవర పాత్ర ఉందో తెలుసుకనే ప్రయత్నం చేశారు. 

మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మీపై చాలా విషయాలు సర్క్యులేట్ అవుతున్నాయి. అవి ఎంత వరకు నిజం?
కాదంబరి జత్వాని:- ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమే. పోలీసులు నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను, నా కుటుంబాన్ని ఎలిమినేట్ చేద్దామని చూశారు. 

ఇంతకీ మీ విషయంలో ఏం జరిగింది?
కాదంబరి జత్వాని:- ఫోర్జరీ జరిగిందని కేసు పెట్టారు. (ఆ కేసుకు కారణమైనా డాక్యుమెంట్ చూపిస్తూ) ఇందులో 2018 నవంబర్‌ డేట్ ఉందని... అందులో నా పేరుతో చూపించిన అడ్రెస్‌ ప్లాట్‌ను నేను 2020లో కొన్నాను. 2018లో నేను అహ్మదాబాద్‌లో ఉన్నాను. యూఎస్ మెడికల్ లైసెన్స్‌ ఎగ్జామ్‌ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా పేరెంట్స్‌ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ వెళ్లలేదు. నేను మాత్రం నా సినిమాల కోసం విజయవాడ వెళ్లాను. కానీ  ఇబ్రహింపట్నంలో వాళ్లు చెప్పిన ప్లేస్‌ పేరు నేను ఎప్పుడూ వినలేదు. ఎప్పుడూ చూడలేదు. అయితే ఎవరిపై ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ దేశంలో మంచివాళ్లు చెడ్డవాళ్లు, నేరస్తులు, ఇలా చాలా మంది ఉంటారు. వాళ్లు ఏమైనా చేసుకోనివ్వండి. కానీ పోలీసులు ఇందులో ఎలా కలుగుచేసుకుంటారు. బాధితురాలినైన నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ల పక్షాన ఎలా నిలబడతారు.

మిమ్మల్ని ముంబై నుంచి తీసుకొచ్చి ఎలా హింసించారు?
కాదంబరి జత్వాని:- ఇలా తప్పుడు కేసుల్లో ఇరికించడం మా ఫ్యామిలీకి నాకు ఓ మరణ శిక్ష లాంటిదే కదా. 

ఇలా మిమ్మల్ని హింసించడానికి ప్రధాన కారణం ఏంటీ?
కాదంబరి జత్వాని:- ప్రతి ఒక్కరికీ తెలుసు వాళ్లకు ఏం కావాలో. ఇందలో చాలా పెద్ద వ్యక్తులు, డబ్బు, అధికారం జోక్యం ఉందని అందరికీ తెలుసు. 

మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్లు చివరకు విజయవంతమయ్యారా?
కాదంబరి జత్వాని:- వాళ్లకు ఏం కావాలో తీసుకోవడంలో వాళ్లు విజయవంతమయ్యారు. నా ఫ్యామిలీని నేను రిస్క్‌లో పెట్టలేను కాబట్టి వాళ్లు సక్సెస్‌ అయ్యారు. మొత్తం ఫ్యామిలీపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారాన్ని, డబ్బులను ఖర్చు పెట్టి నా కెరీర్‌ను నాశనం చేశారు. తప్పుడు సాక్ష్యాలు, కేసులతో నన్ను, నా ఫ్యామిలీని టార్చర్ చేశారు. నా కెరీర్‌ను ఇబ్బందిలో పడేశారు. అందుకే నాకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. 

ముంబై కేసు సంగతేంటీ?
కాదంబరి జత్వాని:- ఆంధ్ర పోలీస్‌ నన్ను నా ఫ్యామిలీని కిడ్నాప్ చేయడంతో ముంబై కేసును పోలీసులు క్లోజ్ చేశారు. ఫిర్యాదు చేసిన అమ్మాయి రెస్పాండ్ కావడం లేదని, ఫోన్‌కు అందుబాటులో లేదని, ఇచ్చిన అడ్రెస్‌లో కూడా ఉండటం లేదని ఆ కేసును క్లోజ్ చేశారు. ముంబైలో కోర్టులో ఫిబ్రవరి 5-9 మధ్య ఆ కేసు విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 6న విజయవాడ పోలీస్ కమిషనర్‌కు బాంబే డీసీపీ దీక్షిత గెడం నా హెల్త్‌ గురించి ఆరా తీస్తూ ఓ లెటర్ రాశారు. అంటే నన్ను పోలీసులు తీసుకెళ్లారని వాళ్లకు తెలుసు అయినా నేను మిస్‌ అయినట్టు కేసు క్లోజ్ చేశారు. వాళ్లకు కావాల్సింది అదే. అందుకే ఇలా చిత్రవధ చేశారు. ఆర్థికంగా చాలా నష్టపోయాను. మానసికంగా కుంగిపోయాను. శారీరకంగా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికి కూడా పీడకలలతో నిద్ర పట్టడం లేదు. 70 ఏళ్లకు పైబడిన నా తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వినికిడి శక్తి కోల్పోయారు. బీపీ వచ్చింది. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. 

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కలుగుచేసుకుంది ఎవరు?  
కాదంబరి జత్వాని:- ఏపీ పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నప్పుడు విజయవాడ సీపీ కంటిన్యూగా వాళ్లకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆమె ఉన్నారా... ఆమె తల్లిదండ్రులు ఉన్నారా అంటూ కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. నేను ఆ కాల్స్ చూస్తూనే ఉన్నాను. ఇందులో అధికారం, డబ్బు చాలా ఇన్వాల్వ్ అయింది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి. 

మీరు ఫోర్జరీ చేశారని కేసు రిజిస్టర్ అయిందని ఆంధ్ర పోలీస్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటీ?
కాదంబరి జత్వాని:- నేను నమ్మలేదు. ఇలాంటివి జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు. ఇలా పోలీసులు వచ్చి నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి నిలువునా దోచుకుంటారని అనుకోలేదు. బయటవారితో కమ్యునికేషన్ లేకుండా 10 ఎలక్ట్రిక్ డివైజ్లను పోలీసులు సీజ్ చేశారు. మా చేతులు కట్టేసి రెండు రోజుల తర్వాత మాకు తెలియని ప్రదేశంలో తీసుకెళ్లి పడేశారు. అప్పుడు మా వద్ద ఎలాంటి ఫోన్ నెంబర్స్‌ లేవు. సమాచారం ఇచ్చేందుకు మార్గం కూడా కనిపించలేదు. ఆ టైంలో మాకు ఏదైనా జరిగి ఉంటే పట్టించుకునే దిక్కు లేదు. మాకు ఏదైనా చేసి ఉంటే అడిగే నాథుడే లేడు. 

విజయవాడలోని గెస్ట్‌హౌస్‌లో మిమ్మల్ని ఉంచారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పోలీసులు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది?
కాదంబరి జత్వాని:- గెస్ట్ హౌస్‌లో ఉంచారనేది అబద్దం. మాపై తప్పుడు కేసులు పెట్టిన తర్వాత ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంలో పడేశారు. అదే నిజం. మానసికంగా చాలా హింసించారు. ప్రతి రోజూ ఓ కొత్త వార్నింగ్‌తో వచ్చే వాళ్లు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బెదిరిస్తూ భయపెట్టేవాళ్లు. ఇందులో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. పశ్చిమబెంగాల్, నొయిడా, ఆంధ్రప్రదేశ్‌ ఇలా ప్రతి చోటా కేసులు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చచ్చిపోతుందని... ఇలా ప్రతి రోజూ హింస పెట్టేవాళ్లు. ఒక్కదానివే ఏం చేయగలవని బెదిరించే వాళ్లు. ఇది పోలీసు అధికారులకే కాదు ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్నారు. మా ఫ్యామిలీకి చెందిన కంప్యూటర్స్, ఫోన్స్, ఐ ప్యాడ్స్‌ లాక్కొని పాస్‌వర్డ్ తెలుసుకొని ట్యాంపర్ చేశారు. వాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 

కుక్కల విద్యాసాగర్ తెలుసా? ఎప్పుడైనా కలిశారా?
కాదంబరి జత్వాని:- అసలు కుట్రలో కేంద్రబిందువే ఈ కుక్కల విద్యాసాగర్. 2009 నుంచి నాకు ఫ్రెండ్‌గా, మా ఫ్యామిలీకి శ్రేయోభిలాషిలా నటించి మా చుట్టూ తిరిగే వాడు. వేరే ఆలోచనలతో ఇదంతా చేశాడు. ఇది గ్రహించిన నేను 2015 నుంచి ఆయన్ని దూరం పెట్టాను. అప్పటి నుంచి పుట్టిన రోజులకు విష్ చేయడం గిఫ్టులు పంపించడం చేసేవాడు. అంతకు ముందు జరిగినదానికి క్షమించాలని కోరేవాడు. అయినా నేను దగ్గరకు రానివ్వకపోవడంతో ఇదంతా చేశాడు. దీని కోసం భారీగా నగదు చేతులు మారింది. దీని కోసం మా ఫ్యామిలీని నాశనం చేశాడు. మా ఇంటికి వచ్చేటప్పుడు ఏపీ పోలీసులు చాలా కాస్ట్లీ వెహికల్స్‌లో వచ్చారు. వాళ్లు ఉన్న హోటల్ కూడా చాలా పెద్దది. నన్ను అంతం చేయడానికి చాలా డబ్బులు చేతులు మారింది. 

మిమ్మలి ముంబై నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారా?
కాదంబరి జత్వాని:- లేదు. వారిని కలవాలని నేనే డిమాండ్ చేశాను. కానీ నన్ను కిడ్నాప్ చేసిన వారిలో ఐపీఎస్ ఆఫీసర్స్‌ లేరు. 

ఎలాంటి బెదిరింపులు చేశారు. ?
కాదంబరి జత్వాని:- అప్పటికే నాపై లీగల్ అటాక్ మొదలైంది. ఇదే కాకుండా ఇంతకు మించి ఉంటుందని బెదిరించారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటుందనన్నారు. ముంబైలో ఉండే నాతోపాటు నా సోదరుడిని కూడా ఇందులో జొప్పించారు. వయసు మళ్లిన తల్లిదండ్రులతో కలిసి నేను ఫైట్ చేయగలనా? నాకు ఇది సాధ్యమేనా, నాకు అవసరం లేదు కదా. ఎన్ని రాష్ట్రాలకు వెళ్లగలను. నా జీవితమంతా దీనికే సరిపోతుందికదా. అందుకే ఇందులో కలుగుచేసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాను. దోషులపై చర్యలు తీసుకోవాలి. 

మీ పేరెంట్స్‌ ఎలా ఇబ్బంది పడ్డారు. వాళ్ల పరిస్తితి ఏంటీ?
కాదంబరి జత్వాని:- ఈ కేసుతో మేమంతా కుంగిపోయాం. మా కెరీర్స్ నాశనమయ్యాయి. ఇప్పటికి కూడా రాత్రిపూట భయపడి లేస్తుంటాం. మా నాన్న అయితే ఇప్పటికీ భయంతో వణికిపోతుంటారు. ఈ దెబ్బకు ఆయనకు గుండె సంబంధి వ్యాధులు, బీపీ లాంటివి వచ్చేశాయి. గతంలో ఆయనికి ఇవి లేవు. మా ఫ్యామిలీ మొత్తానికి వ్యాధులను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటిది ఎవరికీ జరగకూడదు. 

మీ బ్రదర్‌ని కూడా ఇన్వాల్వ్ చేశారా?
కాదంబరి జత్వాని:- అవును, ఆయన్ని కూడా ఇందులో చేర్చారు. దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా వాళ్లకు లేదు. వాళ్లకు ఫ్యామిలీలు లేవా? కర్మ గురించి వాళ్లకు తెలియదా? నాకు ఎదురైంది నా శత్రువులకి కూడా జరగకూడదని రోజూ దేవుడికి ప్రార్థిస్తున్నాను. 

ఇంత జరిగిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు ?
కాదంబరి జత్వాని:- మాట్లాడటానికి భయపడి ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండిపోయాను. ఇక్కడకు వరకు రావడానికి చాలా ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి దరిద్రం తమ జీవితాల్లో జరగాలని ఎవరూ కోరుకోరు. ఈమెను ఏం చేసినా ఏం కాదు అనే సందేశాన్ని ఇవ్వదలుచుకోలేదు. అందుకే బయటకి వచ్చాను. దీని కోసం చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. నాకు అధికార యంత్రాంగం కచ్చితంగా మద్దతుగా నిలబడాలి. ఒంటరిగా నేను ఫైట్ చేయలేను. 

అరెస్టు చేసిన తర్వాత మీతో మాట్లాడింది ఎవరు ఏం జరిగింది?
కాదంబరి జత్వాని:- చాలా మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. ఇందులో పోలీసులే కాదు చాలా మంది ఇతరులు కూడా ఉన్నారు. ఇక్కడ పోలీసులు టూల్‌గా మాత్రమే వాళ్లకు ఉపయోగపడ్డారు. చాలా పవర్‌ఫుల్‌ పీపుల్‌ ఇందులో ఉన్నారు. 

పోలీసు స్టేషన్‌లో ఉండగానే ఆ బిగ్‌ పీపుల్ మీ దగ్గరకు వచ్చారా ?   
కాదంబరి జత్వాని:- వాళ్లెందుకు డైరెక్ట్‌గా వస్తారు. ఇక్కడ పోలీసులు ఉన్నారుగా చెప్పినట్టు చేయడానికి. పోలీసులే కాకుండా వేరే ప్రొఫెషనల్స్ కూడా వచ్చే వాళ్లు రోజూ బెదిరించే వాళ్లు. 

దీని వల్లే మీరు గతంలో పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకున్నారా? 
కాదంబరి జత్వాని:- నాకు వేరే దారి లేదు. మరో పది పదిహేనేళ్లు పోరాడే శక్తి నాకు లేదు. నా జీవితాన్ని మా పేరెంట్స్ జీవితాన్ని రిస్క్‌లో పెట్టదలచుకోలేదు. 

అంటే మిమ్మల్ని చంపేయడానికి ప్రయత్నించారా?
కాదంబరి జత్వాని:- అవును, అంగీకరించుకుంటే నా కథ ముగించేయాలని చూశారు. శాశ్వతంగా నోరు మూయించేయాలని చూశారు. 

ఇప్పుడు ఎలాంటి న్యాయం కోరుతున్నారు. ఎలాంటి మద్దతు ఆశిస్తున్నారు. ?
కాదంబరి జత్వాని:- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి. ఈ కేసును రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలని సీఎం చంద్రాబబును కోరుతున్నాను. నాకు ఇప్పుడు ఆయన దేవుడిలా కనిపిస్తున్నాడు. వాళ్లు కచ్చితంగా నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. డాక్యుమెంట్స్‌ను ఫోర్జరీ చేసిన విద్యాసాగర్‌ను అరెస్టు చేయాలి. నన్ను, నా పేరెంట్స్‌ను హింసించిన ఆయన్ని నాన్‌బెయిల్‌పై అరెస్టు చేయాలి. ఇందులో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది పెద్ద కుట్ర అయినందున ఇందులో చాలా మంది పెద్దలు ఉన్నందున కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కుట్రలో ఏపీలో జరిగింది ఓ చిన్న భాగమే.  ఇప్పటి వరకు వేరే రాష్ట్రాల్లో తప్పుడు కేసులు నమోదు కానందున ఇకపై ఇలాంటివి చేయాలంటే భయపడేలా గట్టి గుణపాఠం ఏపీ ప్రభుత్వం అధికారులకు చెప్పాలని కోరుతున్నాను. 

ఇప్పుడు కూడా మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా... మీరు ప్రమాదంలో ఉన్నారా?
కాదంబరి జత్వాని:- ముంబై కేసు విత్‌డ్రా చేసుకున్న తర్వాత కాల్స్ రావడం లేదు. రిలీజ్ అయిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. ఇప్పటికి కూడా నాకు నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది. అందుకే ప్రభుత్వం మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాను. మళ్లీ ఇలాంటిది రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మళ్లీ ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. 

పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడొచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget