అన్వేషించండి

Bandaru Satyanarayana: గుంటూరు పీఎస్‌లో మాజీ మంత్రి బండారు - రోజాపై వ్యాఖ్యల కేసులో నేడు కోర్టు ఎదుటకు

నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న బండారు సత్యన్నారాయణను పోలీసులు నేడు (అక్టోబరు 3) మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.

సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణను పోలీసులు సోమవారం రాత్రి (అక్టోబరు 2) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండారు సత్యనారాయణ ఇంటిని ఆదివారం రాత్రే చుట్టుముట్టిన గుంటూరు పోలీసులు.. అరెస్టు చేసి సోమవారం రాత్రి గుంటూరుకు తరలించారు. విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు. బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను దూషించారని ఒక కేసు నమోదు కాగా, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి.. గుంటూరులోని అరండల్‌పేట, నగరపాలెంలో పీఎస్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అరెస్టు తర్వాత బండారు సత్యనారాయణను గుంటూరు నగరపాలెం పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.

నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న బండారు సత్యన్నారాయణను పోలీసులు నేడు (అక్టోబరు 3) మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో బండారు సత్యనారాయణపై 153ఏ, 354ఏ, 504, 505, 506, 509, 499 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153ఏ – సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం., 354ఏ-లైగింక వేధింపులు, సెక్సువల్ ఆరోపణలు చేయడం, 504-ఉద్దేశపూర్వకంగా ఇతరులను కించపరచడం, 505-అల్లర్లు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం, 506-నేరపూరిత ఉద్దేశంతో ఇతరులను బెదిరించడం, 509-మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, 499-ఇతరులను ఉద్దేశించి తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చిన వారిపై పరువు నష్టం దావా కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

టీడీపీ నేతలు ఫైర్
మరోవైపు, బండారు సత్యనారాయణ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 41A ఇచ్చిన వెంటనే 41B ఎలా ఇస్తారని టీడీపీ లీగల్ సెల్ అభ్యంతరం తెలిపింది. టీడీపీ మాజీ మంత్రి బండారు బెయిల్ పిటిషన్‌ను ఆయన న్యాయవాదులు సిద్దం చేశారు. మరోవైపు హైకోర్టులో నిన్న వేసిన హౌజ్ మోషన్ పిటిషన్.. రెగ్యులర్ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ విచారించే సమయానికి 41A నోటీస్ ఇచ్చారన్న సమాచారంతో ఈరోజు విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక వాదనలు జరగనున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
White House Attack Case: వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
Embed widget