అన్వేషించండి

Cheetah Wandering in Guntur: మొన్న పులి, నేడు చిరుత - పల్నాడు జిల్లా వాసులను వణికిస్తున్న వన్య మృగాలు!

Cheetah Wandering in Guntur: మొన్నటి వరకు జిల్లాలో రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అవి అడవిలోకి వెళ్లిపోయాయని తెలిసిన రెండ్రోజుల్లోనే చిరుత సంచార మరోసారి కలకలం సృష్టించింది. 

Cheetah Wandering in Guntur: నెల రోజుల క్రితం రెండు పెద్ద పులులు పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమయ్యాయి. నాగార్జునసాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ను పులుల అభయారణ్యంగా మార్చారు. పల్నాడు ప్రాంతానికి అత్యంత్య సమీపంలోనే ఎన్.ఎస్.టి.ఆర్ ఉంది. అభయారణ్యం నుండి బయటకొచ్చిన రెండు పులులు పల్నాడు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అంతేకాకుండా దుర్గి మండలం గజాపురం పొలాల్లో అవుపై దాడి చేసి చంపేశాయి. ఆ తర్వాత రాజానగరం, కాకిరాలలో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రెండు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించామని అయితే అవి మ్యాన్ ఈటర్స్ కాదని ప్రజలు భయపడవద్దని సూచించారు. ఆ తర్వాత ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులులు మూమెంట్ ను ట్రాక్ చేశారు. ఇరవై రోజుల తర్వాత తిరిగి అవి ఎన్ ఎస్ టి ఆర్ లోకి వెళ్ళిపోయినట్లు ట్రాప్ కెమెరాల ఆధారంగా గుర్తించారు. దీంతో పల్నాడు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 

తాజాగా చిరుత కలకలం

ఇది జరిగిన నెల రోజుల తర్వాత గురజాల పట్టణంలో చిరుత సంచారం కలకలం రేపింది. పట్టణంలోని మాడుగుల రోడ్డులోని జియో టవర్ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు గమనించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. పాద ముద్రలను బట్టి నాలుగేళ్ల వయస్సున్న చిరుతగా అధికారులు గుర్తించారు. ఎటు వైఫు నుండి వచ్చింది, ఎటు వెళ్తుంది అన్న అంశాన్ని తేల్చేందుకు ఐదు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు ఎవరూ భయపడ వద్దని  పల్నాడు జిల్లా డీఎఫ్ఓ రామచంద్రరావు చెప్పారు. చిరుతలు మనుషులపై దాడి చేసే అవకాశం లేదని కేవలం వన్య ప్రాణులపైనే మాత్రమే దాడి చేస్తాయంటున్నారు. చిరుతను అడవిలోకి మళ్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పెద్ద పులులు భయాందోళనలు తొలగిపోకముందే చిరుత సంచారంతో పల్నాడు వాసులు బెంబేలెత్తి పోతున్నారు.

ఇటీవలే ఏలూరు జిల్లాలో పులి సంచారం

ఏలూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో  చిరుత సంచారం కనిపించింది. ఈరోజు తెల్లవారుజామున ప్రాజెక్టులో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారుకు చిరుత పులి అడ్డం వచ్చింది. ఒక్కసారిగా కారుకి అడ్డంగా చిరుత రావడంతో వాళ్లంతా భయపడ్డారు. అయితే కారును చూసినా.. అందులో ఉన్న వ్యక్తుల్ని చూసినా... చిరుత పులి ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. పోలవరం ముంపు గ్రామాలను అధికారులు గతంలోనే ఖాళీ చేయించడంతో... ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్రామాల్లో అడవి జంతువులు తిరుగుతున్నాయి. ఇక్కడికి చాలా దగ్గరలోనే పాపికొండల అభయారణ్యం ఉండడంతో ఖాళీ అయిన 19 గ్రామాలలో.. అడవి జంతువులు సంచరిస్తున్నాయి. రాత్రి వేళలో గోదావరి నది వద్దకు వచ్చి నీరు తాగుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కార్మికులతోపాటు అక్కడ పని చేస్తున్న అధికారులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటు నుంచి చిరుత పులి వస్తుందో తెలియక గజగజా వణికిపోతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget