News
News
X

అంగన్‌వాడి మెనూలో మునగాకు- పౌష్టికాహార లోప నివారణకు సరికొత్త ప్రయోగం

మునగాకులో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. అందుకే దీన్ని అంగన్‌వాడీ మెనూలో చేర్చాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

FOLLOW US: 
Share:

అంగన్‌వాడీలకు అందించే ఆహారంలో మునగాకును ప్రభుత్వం చేర్చింది. ఇప్పటి వరకు పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మెను విజయవంతం అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. పోషల విలువలు ఎక్కువ ఉండే మునగాకు వారానికి రెండు రోజులు అందివ్వనున్నారు. దీని వల్ల గర్భిణులు బాలింతలు, చిన్నారల ఆరోగ్య సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని ఆలోచన. 

మునగాకు చేసే మేలు మరే ఇతర ఆకు కూరలు చేయవని చాలా మంది నమ్ముతున్నారు. రోజువారి ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోమని వైద్యులు కూడా చెబుతున్నారు. పసిబిడ్డలకు పాలిచ్చే తల్లులు మునగాకును తీసుకుంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. దీన్ని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. 

మునగాకులో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉంటే ఫ్లేవానాయిడ్లు కారణంగా రక్తపోటును తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి.. గుండె పని తీరు మెరుగు పరచడంలో ఇది బాగా పని చేస్తుంది. 

అందుకే దీన్ని అంగన్‌వాడీ మెనూలో చేర్చాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఓ గ్రామంలో మునగ చెట్లను పెంచి ఆ చెట్టు నుంచి వచ్చే ఆకులను గర్భిణులకు, బాలింతలకు అందజేసింది. మునగాకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో రూపంలో లబ్దిదారులకు అందజేసింది. వారానికి రెండు రోజులు దీన్ని ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయించారు. 

అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్బణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మునగ చెట్ల పెంపకం చేపట్టారు. వారంలో రెండు రోజుల పాటు మునగ ఆకుతో చేసిన కూరను వడ్డిస్తారు. ప్రతి రోజు మొదటి ముద్ద మునగాకు పొడితో తీసుకునేలా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

అంగన్‌వాడిలో ఇచ్చే మెనూ ఇదే

తల్లుల మెనూ

సోమవారం- అన్నం, దోసకాయ పప్పు, కోడిగుడ్డు కూర
మంగళవారం- అన్నం, టమోటా పప్పు, కోడిగుడ్డు కూర
బుధవారం-అన్నం, ఆకుకూర పప్పు, కోడిగుడ్డు కూర
గురువారం- ఎగ్‌ఫ్రైడ్‌రాస్‌, ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబారు
శుక్రవారం- అన్నం, బీరకాయ పప్పు, మునగాకు/పాలకూరతో గుడ్డుకూర
శనివారం- వెజిటబుల్‌ రైస్‌, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడి గుడ్డు

చిన్నారుల మెనూ

సోమవారం- అన్నం, దోసకాయ పప్పు, ఉడికించిన గుడ్డు
మంగళవారం- పులిహోర, టమోటా పప్పు, కోడిగుడ్డు కూర
బుధవారం-అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు 
గురువారం- అన్నం, ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడిగుడ్డు
శుక్రవారం- అన్నం, బీరకాయ పప్పు, మునగాకు/పాలకూర, ఉడికించిన కోడి గుడ్డు
శనివారం- వెజిటబుల్‌ రైస్‌, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడి 

వీటితోపాటు రోజూ తల్లులకు 200 మిల్లీ లీటర్ల పాలు, పిల్లలకు 100 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు. 

Also Read: మునగాకు ఔషధాల గని... ఆహారంలో భాగం చేసుకోండి... అద్భుత ప్రయోజనాలు పొందండి

Also Read: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు

Also Read: మునగాకు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందా? ఎంత మోతాదులో తీసుకుంటే మేలు?

Published at : 09 Mar 2023 08:17 AM (IST) Tags: ANDHRA PRADESH Anganwadi Moringa Health Benefits Of Moringa

సంబంధిత కథనాలు

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

ఏపీలో ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచార కార్యకమం- జనంలోకి ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలు !

ఏపీలో ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచార కార్యకమం-  జనంలోకి ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలు !

టాప్ స్టోరీస్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?