అన్వేషించండి

AP New DGP: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం, ఉత్తర్వులు జారీ

AP New DGP Dwaraka Tirumala Rao: ఏపీ నూతన డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

DGP of Andhra Pradesh అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర పోలీస్ బాస్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ద్వారకా తిరుమల రావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు
వాస్తవానికి గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్ గా ఛాన్స్ ఇచ్చారు. ఈసీ నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ మొత్తం హరీష్ గుప్తా డీజీపీగానే కొనసాగింది. ఇటీవల ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ పర్వం కొనసాగుతోంది.

AP New DGP: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం, ఉత్తర్వులు జారీ

ఈ ఏడాది మే నెలలో కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కాగా, రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన తరువాత సీనియర్లు అయిన అంజనా సిన్హా, ఎం ప్రతాప్ లను కాదని హరీష్ ను పోలీస్ బాస్‌గా ఈసీ నియమించింది. కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర డీజీపీగా నియమించింది. 

ద్వారకా తిరుమలరావు కెరీర్‌ 
1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ఆర్పీ ఠాకూర్ పదవీ కాలం మే 31న ముగియడంతో ఈయనకు అప్పటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. కాగా, గత మూడేళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు రైల్వే శాఖ డీజీపిగా ఉన్నారు. విజయవాడ సీపీగానూ సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. గతంలోనూ విజయవాడ సీపీగా చేసిన గౌతమ్ సవాంగ్.. వైసీపీ ప్రభుత్వంలో డీజీపీ అయ్యారు. అనంతరం ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గానూ సవాంగ్ సేవలు అందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget