కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది, మాట్లాడటం వేస్త్: విజయసాయిరెడ్డి
Vijaysai Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటమే వేస్ట్ అని అన్నారు.
Vijaysai Reddy Comments On Sharmila: కాంగ్రెస్ (Congress) పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(YSRCP General Secratary), రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటమే వేస్ట్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను విడిగొట్టిన కాంగ్రెస్...విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ లేదంటూ సెటైర్లు వేశారు. ఆ పార్టీ గురించి మాట్లాడటం కూడా అనవసరం అని విజయసాయిరెడ్డి అన్నారు. చచ్చిపోయిన పార్టీపై విమర్శలు చేయడం అనవసరమని వ్యాఖ్యానించారు.
ఈ నెల 31న మంగళగిరి హలో బస్సు యాత్ర
సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల 31న మంగళగిరి హలో బస్సు యాత్ర నిర్వహించనునట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గం ఇన్చార్జి గంజి చిరంజీవి, మాజీ ఆఫ్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావులతో కలిసి మంగళగిరి పట్టణంలో పర్యటించారు. 31న మంగళగిరి నిర్వహించే హలో బస్సు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు వైసీపీ అభిమానులు, సానుభూతిపరులు, వైసీపీ కార్యకర్తలు, పార్టీ నేతలంతా హాజరుకావాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజలకు న్యాయం చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నవరత్నాల పథకాల గురించి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికి తెలియజేస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.