అన్వేషించండి

Krishna Teja: ఏపీ వచ్చేందుకు కృష్ణతేజకు కేంద్రం గ్రీన్స్ సిగ్నల్- కేరళలో ఫ్లైట్ ఎక్కడమే లేట్!

Pawan Kalyan OSD: కేరళలో సమర్థవంతమైన అధికారిగా పేరుతెచ్చుకున్న యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి రానున్నారు. ఆయన్ను పవన్ ఓఎస్డీగా నియమించనున్నారు. మూడేళ్లపాటు రాష్ట్రంలో పనిచేయనున్నారు

Andhra Pradesh: కేరళ(Kerala)లో కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్‌(IAS) అధికారి కృష్ణ తేజ(Krishna Teja) రాష్ట్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై రానున్నారు.డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఏరికోరి ఆయన్ను కోరుకోవడంతో కేంద్రం ఆయన్ను మూడేళ్లపాటు డిప్యూటేషన్‌పై  ఏపీకి పంపేందుకు అంగీకరించింది.

ఏపీకి కృష్ణతేజ
ఆపరేషన్ కుట్టునాడు పేరిట 48 గంటల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వరద ముప్పు నుంచి వారి ప్రాణాలు కాపాడి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు  కృష్ణతేజ(Krishna Teja) ఏపీకి రానున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pavan Kalyan)ఏరికోరి మరి తనను ఓఎస్డీగా(OSD) నియమించుకోవడంతో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయన్ను కేరళ(Kerala) నుంచి మూడేళ్లపాడు డిప్యూటేషన్‌పై పంపించేందుకు  కేంద్రం అంగీకరించింది. సమర్థవంతమైన అధికారులను ఒడిసిపట్టి కీలకశాఖల బాధ్యతలు అప్పగిస్తున్న సీఎం చంద్రబాబు(Chandra Babu)...ఏపీకే చెందిన యువ ఐఏఎస్‌(IAS) అధికారిని రాష్ట్రానికి తీసుకురానున్నారు. 

ఆరంభమే అదరగొట్టాడు
2017 కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ(Krishna Teja) తొలిపోస్టింగ్‌ కేరళలోని అలెప్పి జిల్లా సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే కేరళ(Kerala)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. అలెప్పీ(Alleppey)లోనూ  వరదలు ముంచెత్తనున్నాయన్న సమాచారం తెలుసుకున్న కృష్ణతేజ వెంటనే స్పందించారు. వరదలు పోటెత్తితే దాదాపు లక్షలాది మంది ప్రాణాలకు ప్రమాదం అని తెలుసుకుని అన్నిశాఖలను సమన్వయం చేసుకుని కేవలం 48 గంటల్లోనే సుమారు రెండున్నర లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని....ప్రజల తరలింపులో ఆయన స్వయంగా పాల్గొన్నారు. చాలామంది ప్రజలు తాము ఉంటున్న చోటు నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించకపోవడంతో స్వయంగా ఆయనే బోటులో అక్కడి వెళ్లి వారికి నచ్చజెప్పి బయటకు తీసుకొచ్చారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోగానే....ఆయన ఊహించినట్లే వరద పోటెత్తి చాలా ఇల్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడి వరదలు పెద్ద బీభత్సం సృష్టించాయి. వేలాదిమంది ప్రాణాలు కాపాడిన ఆ యువ ఐఏఎస్‌ అధికారిని అక్కడి ప్రజలందరూ దేవుడితో సమానంగా కొలిచారు.

ఒక్కసారిగా కృష్ణతేజ(Krishna Teja) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన సేవలను కొనియాయి. అవార్డులతో సత్కరించాయి. కేవలం వరదల నుంచి కాపాడటమే గాక... ఆ తర్వాత దాతల సాయంతో వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అలాగే కేరళ పర్యాటకరంగానికి గుండెకాయవంటి అలెప్పిలో పెద్దఎత్తున పర్యాటక ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చారు. పర్యాటకరంగానికే గాక..ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న  అనుమతుల్లేని విల్లాల(Villa)ను కూల్చివేశారు. స్థిరాస్తి వ్యాపారులు రాజకీయంగా ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన వెనకడుగు వేయలేదు. కోట్లాది రూపాయల విలువైన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో ఆయన పేరు మరింత మారుమోగిపోయింది. అవినీతి రహిత సమర్థవంతమైన అధికారిగా ఆయన పేరు తెచ్చుకోవడంతో...ఆయన్ను అలెప్పి నుంచి బదిలీ చేయగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ప్రస్తుతం త్రిశూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవలే ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Tirumala News: తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
Embed widget