అన్వేషించండి

CI Nagaraju Suspension: సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు.. నేడు విజయవాడకు ఎస్పీ నరసింహ కిశోర్

మిస్సింగ్ యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై పలు బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బాధితుడి తల్లి ఫిర్యాదుతో సస్పెండైన సీఐ నాగరాజుపై క్రిమినల్ కేసు.
  • సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది.
  • ఎస్పీ నరసింహ కిశోర్ ఈరోజు విజయవాడ చేరుకొని దర్యాప్తు వేగవంతం చేస్తారు.
  • మాజీ సీఎం జగన్ కుటుంబ పరామర్శ, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

Gade Sai Krishna Missing Issue | విజయవాడ: తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుడైన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండైన సీఐ నాగరాజుపై 127 (4), 127(6), 103(1), 238 బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసు విచారణాధికారిగా ప్రభుత్వం నియమించిన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ నేడు (జూన్ 19న) విజయవాడకు చేరుకోనున్నారు. నగరంలో అడుగుపెట్టిన వెంటనే ఆయన ఈ కేసు తీవ్రతపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.


CI Nagaraju Suspension: సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు.. నేడు విజయవాడకు ఎస్పీ నరసింహ కిశోర్

విజయవాడ పర్యటనలో భాగంగా ఎస్పీ నరసింహ కిశోర్ తొలుత రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబులను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక వివరాలు, ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలపై వారితో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన అనంతరం, ఎస్పీ నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేయనున్నారు. 

రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్..

సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు ఏపీ ప్రభుత్వం పవర్ ఫుల్ ఆఫీసర్‌ను రంగంలోకి దింపింది. రాజమండ్రి  ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ కిషోర్ వంటి అధికారికి బాధ్యతలు అప్పగించడం కేసు సీరియస్ నెస్‌ను తెలుపుతుంది. పోలీసులు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదనే ప్రభుత్వం ఆయనను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. 

ఈ కేసులో ప్రధానంగా వినిస్తున్న ఆరోపణ ఏంటంటే.. సాయికృష్ణను విచారణ పేరుతో కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే అతడు మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయం చేశారని ఆరోపణలున్నాయి. ఎస్పీ నరసింహా కిషోర్‌ శుక్రవారం నేరుగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడ లాగ్ బుక్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఆయన విచారించనుండటంపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సస్పెన్షన్ వేటు పడిన సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నిప్పులు చెరుగుతూ.. సాయికృష్ణను పోలీసులే చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు.

ఈ దారుణంలో కృష్ణలంక సీఐతో పాటు విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ఆక్షేపిస్తూ, దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మే నెలలో పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను జగన్ గుర్తుచేశారు. ఆ తర్వాతే మే 9న సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, గోళ్లు పీకి చంపేశారని ధ్వజమెత్తారు. కొడుకు కోసం వచ్చిన తల్లిని సీఐ హేళన చేశారని, డీజీపీ కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని జగన్ తీవ్రంగా విమర్శించారు.

Frequently Asked Questions

సాయి కృష్ణ అదృశ్యం కేసులో సస్పెండైన సీఐపై ఏ చర్యలు తీసుకున్నారు?

సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు 127(4), 127(6) సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ఎవరు బాధ్యత వహిస్తారు?

ఈ కేసు విచారణకు రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన జూన్ 19న విజయవాడకు చేరుకుని ఉన్నతాధికారులతో సమీక్షించి విచారణ వేగవంతం చేస్తారు.

సాయికృష్ణ కేసుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమన్నారు?

వైఎస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, సాయికృష్ణను పోలీసులే చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget