అన్వేషించండి

Gade Saikrishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!

Gade Saikrishna Missing Case: సంచలనంగా మారిన విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు మరో మలుపు తిరిగంది. ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీని ప్రభుత్వం నియమించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయవాడలో సాయికృష్ణ అదృశ్యంపై పోలీసులపై హత్య ఆరోపణలు.
  • కేసు విచారణకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నియామకం.
  • ఎస్పీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ, సిబ్బందిని విచారిస్తారు.
  • సాయికృష్ణ తల్లి సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.

Gade Saikrishna Missing Case: విజయవాడ నగరంలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ . అసలు సాయికృష్ణ ఎక్కడ? గడప దాటిన సాయికృష్ణ ఏమయ్యాడు. కృష్ణలంక పోలీస్‌లు చంపేశారనే ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. " నా కొడుకు బతికున్నాడో లేదో చెప్పండి అని సాయికృష్ణ తల్లి వేస్తున్న ఆర్తనాదాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్‌ని రంగంలోకి దించింది. 

ఈ కేసులో అసలు ఏం జరిగింది? పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? రాజమండ్రి  ఎస్పీ నరసింహ కిషోర్ రాకతో ఈ ఇన్వెస్టిగేషన్ ఏ మలుపు తిరుగబోతోందో చూద్దాం. 

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రాజమండ్రి ఎస్పీ!

విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ కిషోర్ వంటి సమర్థవంతమైన అధికారికి బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూదనే క్లియర్ మెసేజ్‌ని ప్రభుత్వం పంపినట్టు కనిపిస్తోంది. 

కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌పై లాకప్ డెత్ మరక 

ఈ కేసులో ప్రధానంగా వినిస్తున్న ఆరోపణ కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన దారుణం గురించి, సాయికృష్ణను విచారణ పేరుతో తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే సాయి మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు నేరుగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నా ఎస్పీ నరసింహా కిషోర్‌, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్, లాగ్ బుక్స్, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారించనున్నారు. 

బూడిదైనా ఇప్పించండని తల్లి ఆవేదన 

ఏ తల్లికైనా తన బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోవడం సహజం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లిన తర్వాత మళ్లీ కంటికి కనిపించలేదని అతను బతికున్నాడో లేదో కూడా పోలీసులు చెప్పడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. సాయికృష్ణ బతికున్నాడో లేదో కనీసం సమాచారం ఇవ్వాలని, చంపేసి ఉంటే బూడిదైనా ఇవ్వాలని ఆమె వేడుకుంటున్నారు. 

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ 

స్థానిక పోలీసుల విచారణపై సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంటున్నారు. అందుకే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే నిందితులుగా ఉన్నప్పుడు మరో పోలీస్ అధికారి చేసే విచారణ ఎంత వరకు నిష్పక్షపాతంగా ఉంటుందనేది వారి ప్రశ్న. హైకోర్టు పర్యవేక్షణలో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Frequently Asked Questions

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటి?

కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టడం వల్లే అతను మరణించాడని, ఆపై పోలీసులు మృతదేహాన్ని మాయం చేశారని ప్రధాన ఆరోపణ. ఇది లాకప్ డెత్ ఆరోపణలకు దారితీసింది.

సాయికృష్ణ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఎవరిని నియమించింది?

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఇది పోలీసు వర్గాలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది.

సాయికృష్ణ కుటుంబ సభ్యులు ప్రభుత్వం నుండి ఏమి డిమాండ్ చేస్తున్నారు?

సాయికృష్ణ తల్లి తన కొడుకు బతికున్నాడో లేదో తెలియజేయాలని, ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం బూడిదైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులపై నమ్మకం లేక సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget