By: Harish | Updated at : 15 Feb 2023 12:38 PM (IST)
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ తీసుకొస్తున్న ఆర్బీఐ
వంద రూపాయల నాణెం పై త్వరలో నందమూరి తారక రామారావు బొమ్మను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని ఓన్ చేసుకునే పనిలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 100 రూపాయల కాయిన్‌పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించే ఆలోచన వెనుక ఆయనకు గుర్తింపు ఇవ్వడంతోపాటు రాజకీయంగా కూడా లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు, అటు సిని ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో ఆయన పేరుతోపాటు బీజేపీ పేరు గట్టిగా శాశ్వతంగా గుర్తండిపోయే కార్యక్రమాన్ని తలపెట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహరం పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా
గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా చర్చలు జరిపారు. ప్రత్యేకంగా డిన్నర్‌కు ఆహ్వనించి మరి జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు అమిత్ షా. కేంద్రంలో అత్యంత కీలక వ్యక్తి అయిన అమిత్ షా రెండు గంటలపాటు జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలు జరపటం, భోజనం కూడా చేయటం సర్వత్రా చర్చ జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో పొత్తులో ఉండగా, అమిత్ షా వంటి కీలక నేత జనసేనానికి సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్‌ను మాత్రమే ఆహ్వనించి చర్చించారు. అయితే అదంతా ఆర్ ఆర్ ఆర్ విజయవంతంలో భాగంగానే జరిగిందని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు ప్రచారం చేశాయి. నిజంగానే ఆర్ ఆర్ ఆర్ విజయంలో భాగం అయితే రాంచరణ్, రాజమౌళిని అమిత్ షా ఎందుకు ఆహ్వనించలేదనే చర్చ కూడా అప్పట్లో జరింగింది. అమిత్ షాతో సమావేశంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై బీజేపీ మాత్రం రకరకాల ప్రకటనలు చేసింది. ఏపీ నాయకులు మాట్లాడుతూ... ఇద్దరి సమావేశంలో రాజకీయాలపై చర్చ జరగకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
ఇప్పటికే పురంధీశ్వరికి పెద్ద బాధ్యతలు...
భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే నందమూరి తారకరామారావు వారసురాలు దగ్గుబాటి పురంధీశ్వరికి పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీలో పురంధీశ్వరికి ప్రత్యేక గుర్తింపు, ఇవ్వటంతోపాటుగా కీలక పదవులు కూడా కేటాయించారు. మాజీ కేంద్రమంత్రిగా కూడా పని చేసిన పురంధీశ్వరి పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.
ఇప్పుడు సీనియర్‌పై ఫోకస్
ఇప్పుడు నందమూరి తారక రామారావుకు ప్రత్యేక గుర్తింపుగా వందరూపాయలు నాణెంపై ఆయన బొమ్మను ముద్రించేందుకు యోచిస్తుండటం చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్‌కు, ఆయన కుటుంబానికి బీజేపీలో ఎక్కువ ప్రాదాన్యత ఇస్తున్నారనే సిగ్నల్ పంపేందుకు ఇలా చేస్తున్నారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మరి భారత రత్న సంగతి....
ఇప్పటికే నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చాలా సార్లు రామారావుకు భారత ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో సైతం తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక మిగిలింది భారత రత్న మాత్రమే అనుకుంటున్న తరుణంలో వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ అంశం తెర మీదకు వచ్చింది. కేంద్రంలోని బీజేపి రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ అంశం తెర మీదకు తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?
పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు