By: Harish | Updated at : 28 Dec 2022 07:30 PM (IST)
విద్యుత్ శాఖకు తిరుగులేదన్న మంత్రి పెద్దిరెడ్డి
ప్రతి రంగం అభివృద్ధికి ఇంధన శాఖే కారణమని, విద్యుత్ రంగానికి వస్తున్న అవార్డులు, అభివృద్ధే తమ విజయాలని ఏపీ ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని ఆయన అన్నారు.
విద్యుత్ శాఖ డైరీ విడుదల....
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పవర్ యుటిలిటీస్ డైరీ - 2023, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, డిస్కమ్ లు, నెడ్ క్యాప్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఏపీసీడ్కోలకు సంబంధించిన డైరీ, క్యాలెండర్‌ల ఆవిష్కరణతో పాటు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 3వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి హజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి, జీడీపీకి ఆర్థికంగా దోహదపడేది విద్యుత్ రంగం అన్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు అత్యంత నాణ్యమైన, చౌకైన, అంతరాయం లేని విద్యుత్ ను అందిస్తోందన్నారు.
వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్....
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 24x7 నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా పథకం విజయవంతం అయిందన్నారు. వ్యవసాయ దిగుబడులు పెరిగేందుకు, తద్వారా రైతుల ఆదాయం పెరిగేందుకు ఉచిత విద్యుత్ దోహదడపడుతుందని 66 వేల మంది ఆక్వా రైతులకు యూనిట్ కు కేవలం రూ.1.50కే విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. 18,65,000 మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలించి వారికి త్వరగా కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
విద్యుత్ సంస్థల విజయాల్లో ఉద్యోగులు, సిబ్బందిదే కీలకపాత్ర:
విద్యుత్ సమర్థ వినియోగంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మూడు ఇనెర్షియా అవార్డులు పొందడం గర్వంగా ఉందన్నారు. తద్వారా రాష్ట్రానికి గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంపై కొందరు చేస్తున్న విమర్శలకు జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న అవార్డులే సమాధానం అన్నారు. అవార్డులు, అభివృద్ధే తమ విజయాలని ఆనందం వ్యక్తం చేశారు. అంకితభావంతో, సేవాతత్పరతతో పనిచేసేది విద్యుత్ శాఖ ఉద్యోగులు అని ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగులు, సిబ్బంది అందించిన అత్యుత్తమ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విద్యుత్ సంస్థల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భారతదేశంలో ట్రాన్స్ కో ఏపీలో బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. పంప్డ్ విద్యుత్ స్టోరేజ్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అని వెల్లడించారు.
విద్యుత్ రంగం వెన్నెముక
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందడానికి విద్యుత్ రంగం వెన్నెముకలా నిలుస్తుందన్నారు. ఎక్కడ గుర్తింపు ఉంటుందో.. అక్కడ విమర్శలు కూడా వస్తుంటాయని, అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా విద్యుత్ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలన్నారు. నాణ్యమైన, ఉత్తమ సేవలను త్వరితగతిన అందించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తిలో ఎంతో ప్రగతిని సాధించామని తెలిపారు. విద్యుత్ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి రాష్ట్ర విద్యుత్ శాఖ పెరిగిందన్నారు.
కృష్ణపట్నం ప్రాజెక్టుని ఇప్పటికే జాతికి అంకితం చేశామని, అలాగే విజయవాడలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మన విద్యుత్ సంస్థలు వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సరసమైన ధరకే నాణ్యమైన సేవలు అందించి ప్రగతి పథంలో దూసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ ఉద్యోగ శ్రేణులకు విజయానంద్ పిలుపునిచ్చారు.
Gudivada Politics : గుడివాడలో పోటీ చేస్తా - కొడాలి నానిని ఇంటికి పంపిస్తా !
VJA Durga Temple Politics : దేవాదాయ శాఖలో వెల్లంపల్లి జోక్యం చేసుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీలో మరో వివాదం
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్!
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!