AP Governor Hospitalised: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రోబో సాయంతో అపెండెక్టమీ సర్జరీ, హెల్త్ బులెడిన్ విడుదల
AP Governor Abdul Nazeer Hospitaled: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది ఆయనను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
AP Governor Abdul Nazeer Hospitaled:
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తం అయిన సిబ్బంది ఆయనను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ కడుపు నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఏపీ గవర్నర్ హెల్త్ బులెటిన్ విడుదల..
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హెల్త్ బులెటిన్ ను మణిపాల్ హాస్పిటల్ విడుదల చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కడుపునొప్పి కారణంగా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. డాక్టర్లు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ టెస్టుల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నారని డాక్టర్లు నిర్దారించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రోబో సాయంతో అపెండెక్టమీ అనే సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.
గవర్నర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.