AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
AP Donations | ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగుల సంఘాలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సంస్థలు పెద్ద మనసుతో భారీ విరాళాలు అందిస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందజేస్తున్నారు.
![AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత AP CM Chandrababu received Donations To AP Flood Victims from Kia India to Electricity empolyees union AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/f1af3069b740df94d0c38e094ff3be9c1726063644705233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Donations To AP Flood Victims | అమరావతి: వరద బాధితుల కోసం ఏపీ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్, విద్యుత్ ఉద్యోగుల ఐకాస భారీ విరాళం ప్రకటించింది. 10 కోట్ల 61 లక్షల 18 వేల 694 రూపాయల విరాళాన్ని సీఎం చంద్రబాబును కలిసి చెక్కు రూపంలో అందచేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వారిని అభినందించారు.
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వరద బాధితుల కోసం రూ.3 కోట్లు విరాళం ప్రకటించింది. సీఈఓ కబ్ డాంగ్ లీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును అందచేశారు. ఉదారంగా భారీ విరాళం ఇచ్చిన వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.
వరద బాధితుల సహాయార్ధం నారాయణ విద్యా సంస్థలు రూ.2.50 కోట్లు విరాళం ఇచ్చాయి. వరద సాయం చెక్కును సీఎం చంద్రబాబుకు అందచేశారు. సీఎంను కలిసిన వారిలో ఆ సంస్థ ప్రతినిధులు పి.సింధూర, పి.శరణి, పునీత్, ప్రేమ్ సాయి ఉన్నారు. విరాళం ఇచ్చిన నారాయణ విద్యా సంస్థలను సీఎం చంద్రబాబు అభినందించారు.
వరద బాధితుల సహాయార్ధం నారాయణ విద్యా సంస్థలు రూ.2.50 కోట్లు విరాళం ప్రకటించి ఆ చెక్కును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు అందచేశారు. (1/2) pic.twitter.com/FrztAlo076
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 11, 2024
వరద బాధితుల సహాయార్ధం ముఖ్య మంత్రి సహాయ నిధికి దేవీ సీ ఫుడ్స్ రూ.2 కోట్లు విరాళం అందించింది. సాయానికి సంబంధించిన చెక్కును నారా చంద్రబాబునాయుడు కు దేవీ సీ ఫుడ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పొట్రు బ్రహ్మానందం, రమాదేవి అందచేశారు.
వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా తమ వంతు సాయంగా అవంతి ఫీడ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి ఇంద్రకుమార్, అల్లూరి నిఖిలేష్ లు రూ.2 కోట్లు విరాళం అందించారు. సీఎం చంద్రబాబునాయుడు ఈ చెక్కును స్వీకరించారు. వరద బాధితుల సహాయార్ధం సౌత్ కొరియాకు చెందిన ఎల్.జీ కంపెనీ గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పాల్ కౌన్ రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. సంబంధించిన చెక్కును బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందచేశారు.
వరద బాధితుల సహాయార్ధం ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళం చెక్కును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కు దేవీ సీ ఫుడ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పొట్రు బ్రహ్మానందం, రమాదేవి అందచేశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.#AndhraPradesh pic.twitter.com/UiHXiByiVa
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 11, 2024
ఎకోరెన్ ఎనర్జీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎర్నేని లక్ష్మీ ప్రసాద్ వరద బాధితుల సహాయార్ధం రూ.1 కోటి విరాళాన్ని చంద్రబాబుకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్ధం ఇస్కాన్ యుఎస్ఎ వారి సౌజన్యంతో 10 వేల కిట్లు ప్రొటీన్ ఫుడ్ ఐటెమ్స్ ను సిద్ధం చేశారు. ఈ కిట్లను చంద్రబాబునాయుడుకు ఇస్కాన్ యుఎస్ఎ ప్రతినిధులు అందించారు.
మంత్రి లోకేష్‌ను కలిసి చెక్కులు అందజేసిన మరికొందరు
వరద బాధితులను ఆదుకునేందుకు మరికొందరు ముందుకొచ్చారు. సచివాలయంలోని 4వ బ్లాక్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి దాతలు చెక్కులు అందజేశారు.
నెక్కంటి సీ ఫుడ్స్ రూ.1 కోటి విరాళం
డిక్షన్ గ్రూప్ ( Dixon group ) తరపున రూ.1 కోటి చెక్ ను కంపెనీ ప్రతినిధులు అందించారు.
మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో సంధ్యా ఆక్వా రూ.1 కోటి, కొండేపి నియోజకవర్గం ప్రజలు రైతులు తరపున రూ.6. 80 లక్షలు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా రూ.25 లక్షలు.
ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు కు చెందిన డాక్టర్ కేవి సుబ్బారెడ్డి రూ.11 లక్షలు.
హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు
రక్ష హాస్పిటల్స్ నాగరాజు రూ. 5 లక్షలు, ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆల్ఫా ఇన్స్టిట్యూట్ రూ. 5 లక్షలు, రైతులు మరియు కార్యకర్తలు కలిసి రూ.5 లక్షలు
చదలవాడ చంద్రశేఖర్ రూ. 3 లక్షలు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది వంశీ కృష్ణ, పెద్ది విక్రమ్ కలిసి రూ.3 లక్షలు
భీమవరపు శ్రీకాంత్ రూ.2 లక్షలు, ఆశా బాల రూ.1.8 లక్షలు, జర్నలిస్టు జాఫర్ రూ. 1 లక్ష, వి. జ్యోతి రూ. లక్ష విరాళం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో సహాయం చేసిన అందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)