By: ABP Desam | Updated at : 19 Sep 2023 06:54 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ స్కాంపై సీఐడీ పీటీ వారెంట్ వేసింది. టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. 2021లో మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. రూ.121 కోట్లు గల్లంతు అయ్యాయని సీఐడీ ఆరోపించింది.
సీఐడీ చేస్తున్న ఆరోపణల ప్రకారం.. ఫైబర్ నెట్ స్కాంలో రూ.115 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలింది. 2019లోనే ఫైబర్ నెట్ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంట్లో ఏ - 1గా వేమూరి హరి ప్రసాద్, ఏ - 2 మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొంది. చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది.
టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెంబర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు తేల్చింది. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్ దక్కేలా మేమూరి హరిప్రసాద్ చక్రం తిప్పారని గుర్తించింది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. రూ. 115 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ ఆరోపించింది. టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగాయని సీఐడీ వివరించింది.
పీటీ వారెంట్ అంటే ఏంటి?
పీటీ వారెంట్ అంటే (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ - Prisoner in Transit). ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది.
Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్
Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి
చంద్రబాబును 2 రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ పొడగింపు- పిటిషన్‌పై తీర్పులు మధ్యాహ్నానికి వాయిదా
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన
/body>