AP DSC News: 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం- యూనివర్శిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Andhra Pradesh Cabinet : 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంత్రిమండలి ఓకే చెప్పింది. దీంతోపాటు వైఎస్‌ఆర్ చేయూత నాల్గో విడత నిధుల విడుదలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

DSC News: ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఇవాళ భేటీ అయిన కేబినెట్‌లో అమోదం తెలిపింది. దీంతోపాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆమోదం తెలిపింది. 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంత్రిమండలి చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా ఓకే చెప్పారు. 689 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి.
వైఎస్‌ఆర్ చేయూత నాల్గో విడత నిధుల విడుదలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16న చేయూత కింద ఇచ్చే నిధులు ఐదు వేల కోట్ల రూపాయలను జగన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపు ఈ నిధులు విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు.
విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచింది. వారి పదవీ విరమణ వయసు ఇప్పటి వరకు 60 ఏళ్లుగా ఉంది. దాన్ని ఇప్పుుడ 62 ఏళ్లకు పెంచబోతున్నారు. ఎస్‌ఐపీబీ తీర్మానాలకు ఓకే చెప్పింది కేబినెట్. ఇంధన రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒ సెక్రటరీ ఉండాలని క్యాబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించిన విధవిధానాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

