అన్వేషించండి

Andhra Pradesh: 16 మంది సీనియ‌ర్ ఐపీఎస్‌ల‌కు డీజీపీ మెమో- రోజూ హెడ్ ఆఫీస్‌లో వ‌చ్చి సంతకాలు పెట్టాలని ఆదేశం

Andhra Pradesh: సీనియ‌ర్ ఐపీఎస్‌ల‌కు డీజీపీ మెమో జారీ చేశారు. పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్న 16 మంది అధికారుల‌ను రోజూ ఉద‌యం వ‌చ్చి 10 గంట‌ల‌కు పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో రిపోర్టు చేయాల‌ని ఆదేశించారు. 

Andhra Pradesh: 16 మంది సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు ఏపీ డీజీపీ ద్వార‌కా తిరుమ‌లరావు మెమోలు జారీ చేశారు. మెమోలు అందుకున్న ఐపీఎస్ అధికారులంద‌రూ వెయిటింగ్‌లో ఉన్న‌వారే. వారంద‌రూ రోజూ హెడ్ క్వార్ట‌ర్‌లో  వ‌చ్చి రిపోర్టు చేయాల‌ని ఆదేశాలిచ్చారు. మెమోలు అందుకున్న వారిలో పీఎస్సార్ ఆంజ‌నేయులు, విశాల్ గున్ని, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు ఉన్నారు. వీరంతా ఇక‌పై రోజూ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కు డీజీపీ ఆఫీసులోనే అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు. అంతేకాకుండా రోజూ హెడ్ క్వార్ట‌ర్‌లోనే రిపోర్టు చేయాల‌ని డీజీపీ మెమోలో పేర్నొన్నారు. 

మెమోలు అందుకున్న ఐపీఎస్ అధికారులంతా వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వంలో కీల‌క పోస్టుల్లో ప‌నిచేసిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు సీఎం అయ్యాక వీరంద‌రికీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఖాళీగా ఉంచారు. పీ సీతారామంజ‌నేయులు గ‌త ప్ర‌భుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ఈయ‌న చంద్ర‌బాబు సీఎం అయ్యాక రెండు సార్లు క‌లిసేందుకు ప్ర‌య‌త్నించినా చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌లేదు. సునీల్ కుమార్ ఏపీ సీఐడీ డీజీగా ప‌నిచేశారు. ఐపీఎస్ రిశాంత్‌రెడ్డి చిత్తూరు ఎస్పీగా ప‌నిచేశారు. పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని గ‌తంలో టీడీపీ నాయ‌కులు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు. ర‌ఘువీరారెడ్డి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో చంద్ర‌బాబును అరెస్టు చేశారు.

ఐపీఎస్ పాల‌రాజు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గుంటూరు రేంజ్ ఐజీగా ప‌నిచేశారు. అంత‌కుముందు డీజీపీ ఆఫీసులో ఉంటూ దిశ యాక్ట్ అమ‌లు బాధ్య‌త‌ల‌ను చూసేవారు. విశాల్ గున్ని గ‌త ప్ర‌భుత్వంలో విశాఖ డిఐజీగా ప‌నిచేశారు. రూర‌ల్ ఎస్పీగా ప‌నిచేసిన విజ‌య‌రావుతో క‌లిసి అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని అణ‌చివేయాల‌ని చూశాడ‌ని ఆయ‌న‌పై టీడీపీ నాయ‌కులు ఆగ్ర‌హంతో ఉన్నారు.  ఐపీఎస్ కొల్లి ర‌ఘురామిరెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత ఇష్ట‌మైన పోలీస్ అధికారి. ఆయ‌న్ను సిట్ బృందానికి హెడ్‌గా నియ‌మించింది గ‌త ప్ర‌భుత్వం. అమ‌రావ‌తి భూ కుంభ‌కోణాల‌పై ఆయ‌న ద‌ర్యాప్తు జ‌రిపారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు ఆయ‌న్ను ఎన్నిక‌ల క‌మిష‌న్ అస్సాంకు పోలీస్ అబ్జ‌ర్వ‌ర్‌గా బ‌దిలీ చేసింది. కాంతిరాణా టాటా విజ‌య‌వాడ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పై జ‌రిగిన రాళ్ల దాడి ఘ‌ట‌న‌ను ఆయ‌నే ఛేదించారు. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి చంద్ర‌బాబు సీఎం అయ్యాక పోస్టింగ్ ద‌క్కని ఈ 16 మంది సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులంతా ఏదో విధంగా టీడీపీతోనో సీఎం చంద్ర‌బాబుపై కేసుల విష‌యంలోనో, కుంభ‌కోణాల ద‌ర్యాప్తులోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారే.. వీరంద‌రికీ ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు ఖాళీగా ఉంచారు. తాజాగా రోజూ హెడ్ ఆఫీస్‌లో వ‌చ్చి రిపోర్టు చేయాల‌ని డీజీపీ మెమో ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

Also Read: మైనర్ బాలికను పరువు కోసం చంపారా? లేక ఆత్మహత్యా?

Also Read: కొలిక్కిరాని దువ్వాడ కుటుంబ పంచాయితీ, శ్రీనివాస్ మంచి నటుడని మాధురి కామెంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget