అన్వేషించండి

Actor Ali: మనసున్న మంచి మనిషి జగన్, అందుకే ఇళ్ల స్థలాలకు ఓకే చెప్పారు : అలీ

Actor Ali: రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న మూడు సెంట్ల ఇంటి స్టలాన్ని అర్హులైన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ హాస్యనటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు మహమ్మద్ అలీ కోరారు.

Actor Ali: రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న మూడు సెంట్ల ఇంటి స్టలాన్ని అర్హులైన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ హాస్యనటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు మహమ్మద్ అలీ కోరారు. బుధవారం ఆయన విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జర్నలిస్టుల సమస్యలు, ఇంటి స్థలం గురించి మీడియా మిత్రులు చాలా సార్లు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.

సీఎం జగన్‌ను తాను కలిసినప్పుడు జర్నలిస్టులు పడుతున్న సమస్యల గురించి సీఎం వైఎస్ జగన్‌కు వివరించినట్లు చెప్పారు. చాలా మంది జర్నలిస్టులు ఇంటి స్థలం లేక బాధపడుతున్నారని, వారికి న్యాయం చేయాలని జగన్‌ను కోరినట్లు తెలిపారు. సమస్యలు విన్న సీఎం ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే క్యాబినెట్లో ఆ అంశాన్ని పెట్టి ఆమోదదం తెలిపారని అన్నారు. సీఎం జగన్ మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు.

ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా తన వినతులను సీఎం అంగీకరించారని,  మీడియాకు మంచి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన జగన్, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందించి వారి మనసుల్లో కూడా స్థానాన్ని పొందారని అలీ తెలిపారు. మూడు సెంట్ల స్థలం కేటాయింపు గురించి త్వరలోనే విధివిధానాలు వస్తాయని, అర్హులైన వారందరికి ప్రయోజనం చేకూరుతుందని అలీ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను కేబినెట్ భేటీ అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు.

కేబినెట్‌ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ సమావేశంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 38 ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో కులగణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

అలాగే జర్నలిస్టులకు ఈ సమావేశంలో శుభవార్త అందించింది.  జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది.  ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రిమండలి సభ్యులు పలువురు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.  

సీఎం జగన్ నిర్ణయంపై జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. పాత్రికేయుల కష్టాలను ఇప్పటికైనా గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించడం సంతోషించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు జర్నలిస్ట్ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత జర్నలిస్టులకు ఏ ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు కేటాయించలేదన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Embed widget