Vijayasai Reddy: హిందూత్వ వాదిగా విజయసాయిరెడ్డి - బీజేపీలోకి ప్లాన్ చేసుకుంటున్నారా? జనసేనపార్టీలోకా?
Vijayasai: విజయసాయిరెడ్డి తదుపరి రాజకీయ అడుగు కోసం ప్లాన్డ్ గా అడుగులు వేస్తున్నారు. హిందూత్వ వాదిగా ఆయన చేస్తున్న ప్రకటలు ఆయన అడుగులపై క్లారిటీ ఇస్తున్నాయి.

Vijayasai Reddy To BJP: అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఎవరికి అవసరం అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన అవసరం రాజకీయాల్లో ఎవరికీ ఉండదు..ఆయనకే అవసరం కాబట్టి.. మళ్లీ రాజకీయ ఎంట్రీ కోసం గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఆయన ఇటీవల ప్రకటనల ద్వారా వ్యక్తమవుతోంది. హిందూత్వవాదిగా మారి ఆయన ప్రకటనలు చేస్తున్నారు.
కోటరీ ఆరోపణలు చేసి జగన్‌కు దూరం
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి జనవరి 2025లో వైసీపీ పార్టీ, రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యానని ప్రకటించారు. అయితే, ఇటీవలి కాలంలో మళ్లీ పాలిటికల్ ఫీల్డ్‌లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. విజయసాయి రెడ్డి 2019లో YSRCP నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీలో కీలక పాత్ర పోషించి, రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా కూడా ఉన్నారు. కానీ, YSRCPలో అంతర్గత విభేదాలు, జగన్ మోహన్ రెడ్డి పాలిటిక్స్‌పై అసంతృప్తి వల్ల పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నానని తాను కేవలం రైతును మాత్రమేనని చెబుతున్నారు.
ఇటీవల హిందూత్వ వాదం
ఇటీవల హిందూత్వ వాదం వినిపిస్తున్నారు విజయసాయిరెడ్డి ఆలయాల నిర్వహణకు సనాతన ధర్మ బోర్డు ఉండాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే డిమాండ్ ను విజయసాయిరెడ్డి వినిపిస్తున్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ సమస్యకు పరిష్కారం చూపాలని అంటున్నారు. ఇతర మతాల సంస్థలు పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్నాయి, అయితే హిందూ దేవాలయాలు ప్రభుత్వ నిర్వహణ బోర్డుల ద్వారా నిర్వహిస్తున్నారని.. ఇది ఆర్టికల్ 14 కింద వ్యతిరేకమని అంటున్నారు. అందుకే ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని అంటున్నారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది.
The issue of state control over Hindu temples deserves a sincere and balanced review. Unlike institutions of other faiths that function with full autonomy, Hindu temples are regulated through government administered boards. Many believe this creates an unequal framework that…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 11, 2025
గతంలో పవన్ కల్యాణ్‌కు ప్రశంసలు
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ కు తాను అభిమానిని అని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. పవన్ ఇరవై ఏళ్లుగా తనకు చాలా మిత్రుడని..గతంలో ఆయనను తాను ఎప్పుడూ విమర్శించలేదని ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రకటించారు. ఇక ముందు కూడా విమర్శించనని అంటున్నారు. కానీ ఆయన గతంలో పవన్ ను ఘాటుగా విమర్శిస్తూ చాలా సార్లు ట్వీట్లు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు పవన్ , ఇటు బీజేపీకి దగ్గరయ్యేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని .. ఏ పార్టీలో చోటు దొరికితే ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు ప్రకటించారు. మత మార్పిళ్లపై విచారణ జరగాలన్నారు.
హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 7, 2025
త్వరలోనే విజయసాయిరెడ్డి తాను అనుకునే టార్గెట్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ టార్గెట్ ఏమిటో ఆయనకే తెలుసని అనుకోవచ్చు.





















