అన్వేషించండి

Pithapuram Varma: పిఠాపురం ఇంచార్జ్ పదవి తీసేయడంతో కన్నీరు పెట్టుకున్న వర్మ - లోకేష్ ముందే చెప్పారని కవరింగ్

Pithapuram in-charge: పిఠాపురం వర్మ కన్నీరు పెట్టుకున్నారు. టీడీపీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడంతో భావోద్వేగానికి గురయ్యారు. అయితే తనతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.

Verma breaks down in tears:  పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.  పిఠాపురంలో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయిన వర్మ.. మీడియా ముందు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్‌ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు.  

 పిఠాపురం టీడీపీలో భావోద్వేగ పర్వం!
 
పిఠాపురం ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై వర్మ స్పందిస్తూ.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం వర్మ స్పష్టం చేశారు.  గత ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం త్యాగం చేయాలని హైకమాండ్ కోరింది, అప్పుడు కూడా కాదనకుండా పనిచేశాను. ఎప్పుడూ పార్టీ బలోపేతానికే కృషి చేశాను తప్ప, ఎన్నడూ వ్యతిరేకంగా పనిచేయలేదు  అని ఆయన భావోద్వేగంతో చెప్పారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన ఒక నాయకుడు ఇలా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావడం స్థానిక కార్యకర్తలను సైతం కలిచివేసింది.

 నేనే కమిటీని కోరానని వివరణ 

నియోజకవర్గంలో కూటమి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని వేయాలని తానే నారా లోకేష్‌ ను కోరినట్లు వర్మ వెల్లడించారు. తన వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ, అధికారికంగా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావడం ఆయనను ఆవేదనకు గురిచేసింది. మంత్రి లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే ఈ నూతన కమిటీ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని, దీనికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 కూటమి సమీకరణాలతో మార్పులు 

పిఠాపురం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, ఇక్కడ టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. గత కొంతకాలంగా స్థానిక జనసేన నేతలు , వర్మ అనుచరుల మధ్య చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, వివాదాలతో.. కూటమిలో ఘర్షణ వాతావరణం లేకుండా చూసేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు  భావిస్తున్నారు. వర్మను ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా జనసేనతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయాలని టీడీపీ యోచిస్తోంది.

 కార్యకర్తల్లో నిశ్శబ్దం 

మీడియా సమావేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను గుర్తు చేసుకుంటూ వర్మ కన్నీరు పెట్టుకున్నారు. తాను పార్టీని నమ్ముకుని ఉన్నానని, కానీ ప్రస్తుత పరిస్థితులు తనను బాధించాయని చెబుతూ ఆయన ప్రెస్ మీట్ మధ్యలోనే నిష్క్రమించారు. పిఠాపురంలో వర్మకు ఉన్న క్యాడర్ బలం దృష్ట్యా, ఆయనను పదవి నుంచి తప్పించడం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని చర్చ నడుస్తోంది. పార్టీ త్వరలోనే ఇక్కడ కొత్త కమిటీని ప్రకటించనుంది.             

 

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget