Venkayya Naidu : ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై వెంకయ్య చర్చలు - పలువురు కేంద్రమంత్రులతో సమీక్షలు !
విభజన చట్టంలోని అంశాలపై వెంకయ్యనాయుడు కేంద్రమంత్రులతో సమీక్ష నిర్వహించారు. కేటాయించిన వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Venkayya Naidu : ఆగస్టులో పదవీ విరమణ చేయబోతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విభజన చట్టంలో భాగంగా ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయా సంస్థల పురోగతి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తూ వచ్చారు. 2015, 2016లో కేంద్ర మంత్రి హోదాలో చొరవ తీసుకున్న వెంకయ్యనాయుడు.. సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి ఆయా ప్రాజెక్టులు మంజూరు అయ్యేందుకు కృషి చేశారు. అయితే ఇప్పుడు పదవి విరమణకు ముందు మరోసారి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అప్పుడే - కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన వాటిని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సూచించారు. వెంకయ్యతో రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్‌జోషి, డాక్టర్ జితేంద్రసింగ్ తదితరులు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాలోని పాలసముద్రంలో ఏర్పాటుచేసిన బీఈఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ పురోగతి గురించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
బెంగళూరులోని మిసైల్స్ సిస్టమ్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్‌కు అనుసంధానంగా 2015లో ఈ సంస్థకు శంకుస్థాపన జరిగింది. 900 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్న ఈ సంస్థ దేశంలో అతిపెద్దది. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ పురోగతి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఉపరాష్ట్రపతికి నిర్మలా సీతారామన్ వివరించారు. మిథాని, నాల్కో ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా నెల్లూరులో ఏర్పాటు చేయ తలపెట్టిన హై ఎండ్ అల్యూమినియం మిశ్రమం అభివృద్ధి, తయారీ సంస్థ ఏర్పాటు పనుల పురోగతి గురించి కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాంప్లెక్స్ ను కూల్చేస్తానంటూ జేసీ ప్రభాకర్ మాస్ వార్నింగ్!
నెల్లూరు జిల్లా తుపిలిపాళెంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పురోగతి గురించి కేంద్ర శాస్త్రచ సాంకేతిక శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నుంచి ఉపరాష్ట్రపతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంకయ్యనాయుడు ఏపీ అంశాలపై ఇలా చొరవ చూపడంతో .. పదవి విరమణ తర్వాత ఆయన ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.