Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అరుదైన ఛాన్స్! ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం
Janasena News: ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్నాయి.
Janasena Chief Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) నుంచి ఆహ్వానం వచ్చింది. మే 22వ తేదీన జరగనున్న ఐరాస సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించాలని ఆ ఆహ్వానంలో ఉంది. ఈ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. భారతదేశం తరఫున ఈ సమావేశాలకు కేవలం నలుగురికి మాత్రమే ఆహ్వానం ఉందని.. అందులో పవన్ కల్యాణ్‌కు చోటు దక్కిందని తెలిసింది. ఐరాస సమావేశంలో పాల్గొనడం కోసం మే 20న పవన్ కల్యాణ్ న్యూయార్క్ కు వెళ్లనున్నట్లు తెలిసింది.
దేశం తరఫున కృషి చేస్తున్న నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అంటున్నారు. అలా ఆ నలుగురిలో పవన్ కల్యాణ్ కు అవకాశం వచ్చినట్లు తెలిసింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మే 11 సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మే 13 నుంచి జూన్ 3 వరకూ రాజకీయ నాయకులు అందరూ ఉత్కంఠతోనే కాస్త విశ్రాంతిలో ఉండనున్నారు. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు న్యూయార్క్ కు మే 20న వెళ్తారని తెలుస్తోంది.