(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Lokesh Security : చంద్రబాబు, నారా లోకేష్ భద్రతపై కేంద్రం దృష్టి - నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ లేఖ !
చంద్రబాబు, లోకేష్ భద్రతపై నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ, సీఎస్‌లను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వారి పర్యటనల్లో జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chandrababu Lokesh Security : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితులు, రాళ్ల దాడులు... వారి భద్రత విషయంలో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం అంశాలను టీడీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకె్ళ్లారు. చంద్రబాబు,లోకేశ్ ల కల్పించిన భద్రతపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ
ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది.
లోకేశ్ పాదయాత్రలో కల్పిస్తున్న భద్రత వివరాలను కేంద్ర హోంశాఖ కోరింది.
చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో బయట పడుతున్న ఉల్లంఘనలపై కేంద్రానికి ఎంపీ కనకమేడల లేఖ రాశారు. భద్రత కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని కనకమేడల ఫిర్యాదు చేశారు.
తెదేపా ఎంపీ కనకమేడల లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ నవంబర్ 4న చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిపై నివేదిక కోరింది. చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌కు కేంద్రం ఆదేశించింది. జులై 27న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలపై దాడులపైనా కేంద్రం హోంశాఖ .. రాష్ట్ర డీజీపీ, సీఎస్‌ను వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ లేఖ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకముందే.. పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడులు జరగడం.. చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు పర్యటనల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూండటంతో గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు సెక్యూరిటీని రివ్యూ చేసిన ఎన్ఎస్‌జీ కొత్తగా మరో ఇరవై మంది కమెండోలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి నిబంధనల ప్రకారం షిఫ్ట్‌కు ఎనిమిది మంది భద్రత కల్పించేవారు. ఏడాది నుంచి వారి సంఖ్యను మరో ఇరవై మందికి పెంచారు. అప్పటి వరకూ డీఎస్పీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో ఆయన భద్రత ఉండేది. ఏడాది నుంచి డీఐజీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని... ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూరించడానికి కూడా వెనుకాడటంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారుని ... చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేసినా పెద్దగా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగినప్పుడు ఓ వృద్ధుడు గాయపడ్డి...ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ వ్యవహారం కూడా దుమారం రేపింది. ఇప్పుడు పుంగనూరులోనే అలాంటి పరిస్థితే ఏర్పడటంతో.. కేంద్రం చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు.