అన్వేషించండి

Andhra Pradesh Debt: ఫలించిన దిల్లీ పర్యటనలు... ఏపీకి రూ.పది వేల కోట్ల రుణం... ఆర్బీఐకి కేంద్ర ఆర్థికశాఖ లేఖ

బహిరంగ మార్కెట్ నుంచి రూ.10 వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా చేస్తున్న వినతులపై కేంద్రం స్పందించి రుణపరిమితి పెంచింది.

ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకునేందుకు అనుమతి లభించింది. మరో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతి ఇచ్చింది. దీనిపై రిజర్వు బ్యాంకుకు సమాచారం పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ తాజా నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి ఇచ్చిన రుణ పరిమితి మేరకు ఇప్పటికే ఏపీ రుణాలు తీసుకుంది. ఈ అనుమతికి అనుగుణంగా రూ.1,000 కోట్లు గత మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రుణంగా స్వీకరించింది. కేంద్రం విధించిన పరిమితికి పూర్తవ్వడంతో మున్ముందు రాష్ట్ర ఆర్థిక అవసరాలకు రుణాలు ఎలా అనే ప్రశ్నతలెత్తింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కొత్తగా రుణం దొరికే మార్గం కనిపించింది.

ఫలించిన పర్యటనలు

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఆర్థిక శాఖ అధికారులు రుణ పరిమితి పెంపు కోసం చేసిన దిల్లీ పర్యటనలు ఫలించాయి. అంతకుముందు సంవత్సరాల్లో అదనంగా తీసుకున్న రుణాల కోత నుంచి ఈ ఏడాదిని మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో రూ.10,500 కోట్ల రుణానికి అనుమతినిచ్చింది. డిసెంబరు వరకు ఉన్న రుణ పరిమితిని పెంచినట్లయింది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్రం అప్పుగా తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో తొలి తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగింది. 

Also Read: టీఆర్ఎస్ ఢిల్లీ రాజకీయాలతో గల్లీ బీజేపీలో గందరగోళం ! కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయిందా !?

రుణ పరిమితికి మించి

ఏపీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.42,472 కోట్ల రుణం తీసుకునే అర్హత ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నాలుగు శాతం మేర మాత్రమే రుణం పొందవచ్చు. దీంట్లో కేంద్రం అనేక షరతులు విధించింది. మూలధన వ్యయం నిర్దిష్ట పరిమితి మేరకు ఖర్చు చేస్తేనే 0.5 శాతం రుణం లభిస్తుందని పేర్కొంది. ఆ మేరకు రూ.5,309 కోట్లు కోత పెట్టింది. మిగిలిన రూ.37,163 కోట్లకు ఇప్పటికే రాష్ట్రం పొందిన రుణాలు తిరిగి చెల్లించినందున రూ.14,429 కోట్లు అదనంగా చేర్చింది. దీంతో మొత్తం రుణ అర్హత రూ.51,592 కోట్లకు పెరిగింది.  ఏపీ గతంలోనే ఈ రుణ పరిమితిని దాటేసింది. ఆ మొత్తం విలువ రూ.17,923 కోట్లుగా ఉంది. ఇది మినహాయించి, కొత్తగా రుణ అర్హత రూ.33,668 కోట్లుగా తేల్చారు. ఇందులో నుంచి ఇతర రుణాల మొత్తం రూ.6,000.21 కోట్లు కోతపెట్టారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రుణ పరిమితిని రూ.27,668.68 కోట్లకు పరిమితం చేశారు. 

రుణపరిమితిపై లేఖలు

రుణ పరిమితిపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏప్రిల్‌, జులైలో  కేంద్రానికి  రెండు లేఖలు రాశారు. గత ప్రభుత్వం పరిమితికి మించి చేసిన రుణాన్ని ఈ ఏడాదిలో కోత పెట్టవద్దని కోరారు. వివిధ సమీకరణాలు, వాదనల తర్వాత కేంద్రం తాజాగా రాష్ట్ర రుణ పరిమితిని పెంచింది. దీంతో తొలి తొమ్మిది నెలలకు రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగింది. రుణ ప్రతిపాదనలను రాష్ట్రం రిజర్వు బ్యాంకుకు సమర్పించింది. మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రూ.2,000 కోట్ల రుణం సమీకరించనుంది. 18 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 20 ఏళ్ల గడువుతో మరో రూ.1000 కోట్లు రుణం తీసుకోనుంది. 

 

Also Read: AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Embed widget