Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
Top 5 Telugu Headlines Today 29th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించింది. తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసిన ఆ పార్టీ ప్రజల్లో విస్తృత చర్చకు దారి తీసింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న పథకాలు పీకేస్తారని వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రచారానికి ఈ మేనిఫెస్టోతో కౌంటర్ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఉన్న పథకాల కంటే మరింత మెరగైనవి ఇస్తామంటూ ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం సంక్షేమం పేరుతో జగన్ ఇస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెప్పకనే చెప్పింది టీడీపీ. ప్రజల్లో కొత్త అనుమానలు రాకుండా అలాంటి పథకాలనే మేనిఫెస్టోలో పెట్టింది. ప్రస్తుతం అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 15 వేలు ఇస్తున్నారు. స్కూల్ నిర్వహణకు కొంత కట్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇది వర్తిస్తుంది. టీడీపీ అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరు పెడతామని పేర్కొంది. అదే 15 వేలు ఇస్తామని చెప్పింది. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
ర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకేకు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
మేనిఫెస్టో అంటే సినిమా కాదంటూ, అందుకే విడతల వారీగా విడుదల చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని వైసీపీ నేతలు విమర్శించారు. అసలు చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం అని అన్నారు. ముసలి బ్యాచ్ ఒకరికొకరు పలకరించుకోవడానికే మహానాడు పెట్టారని ఎద్దేవా చేశారు. మహానాడు క్రమంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు విడుదల రజిని, మేరుగు నాగార్జున, మాజమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వేర్వేరు చోట్ల టీడీపీపై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గు చేటని మంత్రి విడుదల రజిని అన్నారు. తొలి విడత అంటూ దాన్ని విడుదల చేయడం ఏంటో అంటూ తల పట్టుకున్నారు. తమ నాయకుడు మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తారని చెప్పారు. ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా నెరవేర్చి ప్రజల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారన్నారు. కానీ చంద్రబాబు 2014లో 600కు పైగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే మహానాడు పెట్టుకుంటారంటూ కామెంట్లు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రెజ్లర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని సూచించారు. వారికి మనందరం గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. నెల రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్ అభ్యర్థించారు. ఢిల్లీలో ఉన్న జగన్... నిన్న రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను అమిత్‌షా దృష్టికి జగన్ తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని రిక్వస్ట్ చేశారు. ఏపీ,తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవచూపాలన్నారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందపరిచిన ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి