TDP In Yatra Mood : ఇక జిల్లాల్లో టీడీపీ యాత్రలు - ఎన్నికలయ్యే వరకూ ప్రజల్లోనే నేతలు !
ఎన్నికలయ్యే వరకూ యాత్రలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. చంద్రబాబు ఈ నెల నుంచే జిల్లాలకు వెళ్తున్నారు. అక్టోబర్ నుంచి లోకేష్ యాత్ర ఉండే అవకాశం ఉంది.
TDP In Yatra Mood : తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక పూర్తిగా ప్రజల్లో నే ఉండాలని నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 15వ తేదీ నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అక్టోబరు లో లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన లను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు.
ఎనభై నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయం
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే లక్ష్యంతో ఈ యాత్రలు సాగనున్నాయి. ఒంగోలులో నిర్వహించిన పార్టీ మహానాడు విజయవంతం కావడంతో ఇదే ఊపుతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నారు. రాష్ట్ర పర్యటన అంశంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నా యుడుతోపాటు ఇతర ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పదో తరగతి తప్పిన వైఎస్ఆర్‌సీపీ నేతల కోసం త్వరలో జూమ్ మీటింగ్ - జగన్‌నూ ఆహ్వానిస్తామన్న టీడీపీ !
ప్రజలు, క్యాడర్, నేతలతో విడివిడిగా సమావేశాలు
ఏడాదిలో 80 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. 26 జిల్లాల్లో ఏడాది పాటు విస్తృత పర్యటనలు నిర్వహించనున్నారు. నెలకు రెండు జిల్లాల్లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో జిల్లా మహానాడు నిర్వహించనున్నారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్‌షోలు, బహిరంగ సభలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటులోని 7 అసెంబ్లీ ఇన్‌ఛార్జులతో సమీక్షలు, కేడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా పర్యటన సాగ నుంది. ఒక పక్క జిల్లాల పర్యటనలు, పార్టీ కార్యాల యంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్ రూపొందించారు. అక్టోబరులో లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నారు.
గది కేటాయించలేదని టీటీడీ ఉద్యోగిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పీఆర్వో దాడి - తిరుమలలో కలకలం !
వైఎస్ఆర్‌సీపీ కూడా ప్రజల్లోనే !
వైఎస్ జగన్ కూడా తమ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఎనిమిది నెలల పాటు గడప గడపకూ వెళ్లనున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం ఉంది కాబట్టే.. ఆ గడువు పెట్టారని భావిసతున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి వచ్చేసిందన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.