Top Headlines: టెస్లా ప్రతినిధులతో లోకేశ్ సమావేశం - సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top News In Ap And Telangana:
1. టెస్లా ప్రతినిధులతో లోకేష్ సమావేశం
అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ మినిస్టర్ లోకేష్ టెస్లా ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల నుంచి అమెరికాలో ఉన్న నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాపార అనుకూలతను వివరిస్తున్నారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ నెల 25న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్‌లో భాగంగా ఆదివారం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇంకా చదవండి.
2. దీపావళికి రైల్లో సీట్ దొరకలేదా.?
దీపావళి పండుగను సొంత ఊర్లో, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విద్య, ఉద్యోగం, ఇతర కారణాలతో ఊరు విడిచి వెళ్లిన వ్యక్తులు పండుగ సమయానికి స్వగ్రామాలకు పయనమవుతారు. ప్రస్తుతం, భారతదేశంలో రైలు ప్రయాణంలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. కన్ఫర్మ్‌డ్ టికెట్ పొందడం సవాల్‌గా మారింది. దీంతో ప్రయాణికులు ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని పరిష్కరించడానికి ఐఆర్‌సీటీసీ వికల్ప్ స్కీమ్‌ను (IRCTC Vikalp Scheme) ప్రవేశపెట్టింది. కన్ఫర్మ్‌డ్ సీట్లు పొందేందుకు ఈ స్కీమ్ అవకాశం కల్పిస్తుంది. ఇంకా చదవండి.
3. సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ
జన్వాడ పామ్‌హౌస్‌లో జరిగిన లిక్కర్ పార్టీ వ్యవహారంలో ఎక్కువగా వినిపిస్తున్న రాజ్ పాకాల. ఈ కేసులో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తనకు రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చాడని చెప్పారు. బయటకు వచ్చాక తాను పోలీసులు అలాంటిదేమీ చెప్పలేదని వీడియో రిలీజ్ చేశారు. అది వేరే విషయం. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా NDPA కేసులో రాజ్ పాకాలను A1గా చేర్చి కేసు నమోదు చేశారు. ఆసలు ఈ రాజ్ పాకాల ఎవరు ? ఎందుకింద వివాదాస్పదమవుతున్నారు.?. ఇంకా చదవండి.
4. హైదరాబాద్‌లో ఎలాంటి పార్టీలకు అనుమతి తీసుకోవాలి.?
జన్వాడ ఫాంహౌజ్ కేసుతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీలు చేసుకోవడమే కాకుండా పార్టీలో విదేశీ లిక్కర్, డ్రగ్స్ వాడినట్టు కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇందులో ప్రముఖల బంధువుల పేర్లను కూడా ప్రస్తావించారు. ఈ కేసులో ఓవైపు విచారణ సాగుతుంటే... మరోవైపు రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పార్టీకి అనుమతి తీసుకోలేదని చెప్పడంతో చాలా మందికి కొత్త సందేహం వచ్చింది. ఇంకా చదవండి.
5. హైదరాబాద్‌లో నెల రోజులు తీవ్ర ఆంక్షలు
ఏక్‌పోలీస్ విధానం కోసం పోరాడుతున్న బెటాలిన్ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్‌లో ఎలాంటి ఆందోళనలకు, ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని కమిషనర్ సీవీ అనంద్ స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్ 163 అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రాజధాని హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి నవంబర్ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పూర్తిగా నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఇంకా చదవండి.