Top 5 Headlines Today: వాలంటీర్లపైనే జగన్ ఎక్కున నమ్మకం పెట్టుకున్నారా ? తెలంగాణ బీజేపీలో మార్పులు తప్పవా?
Top 5 Headlines Today 19th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
వాలంటీర్లపైనే జగన్ ఎక్కున నమ్మకం పెట్టుకున్నారా ? లీడర్లను చేస్తానన్న హామీ దేని కోసం ?
ప్రభుత్వం గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరగడానికి .. వారికి ప్రభుత్వం చేస్తున్న మేళ్లు గురించి వివరించడానికి వాలంటీర్లు ముందు ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగన్ మాటలు వింటే ఆయన వైసీపీ క్యాడర్ కన్నా ఎక్కువగా వాలంటీర్లపై నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వంలోనూ వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వ పథకాలు నేరుగా ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారని.. 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లేనని సీఎం జగన్ అంటున్నారు.
వాలంటీర్లను లీడర్లను చేస్తానని జగన్ హామీ
5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారధులు వాలంటీర్లు అని.. ప్రతి గడపకూ నేరుగా వాలంటీర్లే మనకున్న బలం అని నేరుగా చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారని.. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్‌కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులని.. వాలంటీర్ కార్యక్రమం మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని జగన్ హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పట్లోనే తాను లీడర్లుగా చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఆ మాటను గుర్తు పెట్టుకోవాల నిసూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
విచారణకు మళ్లీ అవినాష్ రెడ్డి డుమ్మా - సీబీఐ సీరియస్ !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం పది గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి .. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆయన పులివెందుల వెళ్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఢిల్లీకి బండి సంజయ్ - తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు ఉండబోతున్నాయా ?
ఢిల్లీకి తనను ఎవరూ పిలువలేదని చెప్పిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజల్లోనే ఢిల్లీ పయనం అయ్యారు. ఆయన బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలను కలవనున్నారనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ నేతలను కలిశారు. ఏ అంశంపై కలిశారో స్పష్టత లేదు కానీ.. తెలంగాణ బీజేపీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడంతో వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఇప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికల ముంగిట ఇలా నాయకత్వాన్ని మార్చడం మంచిది కాదని ఉన్న వారితోనే స్ట్రాటజీ ఉపయోగించి రాష్ట్రంను కమలంలో కలుపుకోవాలని బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అమెరికా పర్యటనలో జాప్‌కామ్ గ్రూపుతో కేటీఆర్ ఒప్పందం
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. అమెరికాకు చెందిన ప్రొడక్స్ ఇంజినీరింగ్ అండ్ సొల్యుషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపుతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో జాప్ కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్ టెక్, రిటేల్ రంగాల్లో కీలకమైన ఏఐస ఎన్ఎల్పీ ఉత్పత్తులను జాప్ కామ్ కంపెనీ రూపొందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అన్నమయ్య డ్యామ్ ఎప్పుడు? ఉదయాన్నే వైసీపీకి టాస్క్ ఫిక్స్ చేసిన పవన్
వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. పాపం పసివాడు అంటూ మొన్న ట్వీట్ చేసిన ఆయన... జగన్ చేస్తోంది క్యాష్ వార్ అంటూ నిన్న మరో విమర్శ చేశారు. ఇప్పుడు బాధ్యులే బాధితుల్లా మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యపోతూ మరో ట్వీట్ చేశారు. ఈసారి 2021 వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. అస్మదీయులకు ప్రాజెక్టు కట్టబెట్టినా నేటికి కూడా పనులు పూర్తి కాలేదని ఎద్దేవా చేస్తూ వరుస ట్వీట్లు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి