అన్వేషించండి

అన్నయ్య! అన్నమయ్య డ్యామ్‌ ఎప్పుడు? ఉదయాన్నే వైసీపీకి టాస్క్ ఫిక్స్ చేసిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్నమయ్య డ్యామ్‌ ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. పాపం పసివాడు అంటూ మొన్న ట్వీట్ చేసిన ఆయన... జగన్ చేస్తోంది క్యాష్‌ వార్‌ అంటూ నిన్న మరో విమర్శ చేశారు. ఇప్పుడు బాధ్యులే బాధితుల్లా మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యపోతూ మరో ట్వీట్ చేశారు. ఈసారి 2021 వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్‌ సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. అస్మదీయులకు ప్రాజెక్టు కట్టబెట్టినా నేటికి కూడా పనులు పూర్తి కాలేదని ఎద్దేవా చేస్తూ వరుస ట్వీట్లు పెట్టారు. 

 2021 నవంబర్‌ 19న జల విలయానికి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని... ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారను 22 వేల ఎకరాల్లో పంట మునిగిందని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అప్పట్లో ఘటనపై రియాక్ట్ అయిన ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చిందని ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. బాధితులకు మూడు నుంచి ఆరు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని..అన్నమయ్య డ్యామ్‌ పునర్‌నిర్మిస్తామని చెప్పినట్టు వీడియోలో వివరించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఓ హైపవన్ కమిటీ కూడా వేస్తున్నట్టు గుర్తు చేశారు. 

ప్రమాద ఘటన జరిగిన నేటి 18 నెలలు గడుస్తున్నా బాధితులకు ఎదురు చూపులు.. రైతులకు ఎండమావులే అంటూ స్టేట్‌మెంట్‌తో కూడిన వీడియో వదిలారు. మాటలు మిన్న.. ఫలితాలు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. దీంతోపాటు వరుస ట్వీట్‌లు కూడా చేశారు. 

అసెంబ్లీలో ఏపీ సీఎం అన్నమయ్య డ్యామ్ ప్రమాదంపై మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారన్నారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో ,  AP CM  ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక అంటూ విమర్శించారు. 

రాజ్యసభలో కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షకావత్ మాట్లాడుతూ అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారన్నారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని గుర్తు చేశారు. 

అన్నమయ్య డ్యామ్‌ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారని అన్నారు. దుర్ఘటన జరిగి 18 నెలలు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక అన్నారు. కనీసం ఈ రోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదని విమర్శించారు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారని సెటైర్లు వేశారు. 

Also Read: గుడివాడ బస్టాండ్‌ దగ్గరే తేల్చుకుందాం - కొడాలి నానికి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ ! అసలేం జరిగిందంటే ?

Also Read: ఓ వైపు లోకేష్ - మరో వైపు చంద్రబాబు ! ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశమే హైలెట్ అవుతోందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget