సీఎం జగన్ ఢిల్లీ టూర్‌తోపాటు ఏపీలో ఉన్న ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవే!
నెల్లూరుజిల్లా కందుకూరులో నిన్న సాయంత్రం జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర సంతాప వ్యక్తం చేశారు.
విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ ఈ రోజు తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం 6:45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం నగరంలో బస చేస్తారు. సాయంత్రం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు హైకోర్టులో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
నేడు అమిత్‌షాతో జగన్ భేటీ
రాష్ట్రానికి చెందిన ఆర్థిక సమస్యలు తీర్చాలని కోరుతూ కేంద్రం పెద్దలతో సమావేశం అవుతున్న ముఖ్యమంత్రి జగన్... ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. నిన్న ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని వేడుకున్నారు.
కందుకూరు ఘటన మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున సాయం
కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు మరణించిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా తన వంతుగా ప్రతి కుటుంబానికి రూ.1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నట్టుతెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మరియు కార్యకర్తల సంక్షేమ విభాగ కోఆర్డినేటర్ లోహిత్ తెలిపారు.
బీజేపీ సంతాపం
నెల్లూరుజిల్లా కందుకూరులో నిన్న సాయంత్రం జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర సంతాప వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమైనప్పటికీ సభలు, సమావేశాలు సందర్భంగా రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష పార్టీల సభలకు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. మరోవైవు ఈరోజు సోము వీర్రాజు విశాఖ లో పార్టీ గిరిజన మోర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు బాపట్ల జిల్లా హైవేపై రన్‌వే ట్రయల్‌రన్
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రేణింగవరం వద్ద జాతీయ రహదారిపై రన్‌వే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఉదయం 11 ix'nkg ఐఏఎఫ్‌కు చెందిన ఓ కార్గో విమానం, నాలుగు యుద్ధవిమానాలు ల్యాండ్ కానున్నాయి. దీనికి అనుగుణంగా రేణింగివరం, కొరిశపాడు మధ్య మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు అధికారులు.