AP News Developments Today: కడపలో సూపర్ స్టార్ రజిని కాంత్, దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ రెహ్మాన్ సందడి
భవానీ దీక్షల సందర్భంగా విజయవాడ నగరంలో ఈ నెల 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాలకు అనుమతి రద్దు చేయనున్నారు.
మహిళా, శిశు సంక్షేమంపై సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. అంగన్ వాడీలపై ప్రత్యేక చర్చ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో ఆ సమావేశం ప్రారంభం కానుంది.
ఇవాళ తిరుపతి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో తమిళ స్టార్ రజినీకాంత్ రానున్నారు. అమీన్ పీర్ దర్గాను దర్శించుకోనున్నారు. దర్గాలో ప్రత్యేక ఫాతేహే నిర్వహించనున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏఆర్ రెహ్మాన్ కూడా నేడు అమీన్ పీర్ దర్గాకు రానున్నారు.
సత్యసాయి జిల్లాలో నేడు వైఎస్ఆర్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు.
గుంటూరులో ఈ నెల 17 నుంచి 22 వరకు నగరంలో గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు జరగనున్నాయి.
ఈ నెల 18న సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర జరగనుంది. అక్కడ జరిగే బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
కడపలో నేటి నుంచి బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరీ దేవి ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. 20వ వరకు ఆరాధన ఉత్సవాలు సాగనుండగా.. మఠం నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నేడు అన్నవరం రానున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
భవానీ దీక్షల సందర్భంగా విజయవాడ నగరంలో ఈ నెల 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాలకు అనుమతి రద్దు చేయనున్నారు. హైకోర్టు, సెక్రటేరియట్ ఉద్యోగులను కనకదుర్గమ్మ వారధి మీదుగా మళ్లింపు చేయనున్నారు.