Top Headlines: బ్లాక్‌లో తిరుమల వీఐపీ దర్శన టికెట్లు - హైడ్రా కీలక ప్రకటన, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. బ్లాక్‌లో తిరుమల వీఐపీ దర్శన టికెట్లు
నిత్యం ఏదో విషయంతో తిరుమల వ్యవహారం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తిరుమలలో దర్శన టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం వెలుగుచూసింది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు విక్రయిస్తోందని జకియా ఖానంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరు వీఐపీ టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేస్తున్నారని బెంగళూరుకు చెందిన భక్తుడు వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు. ఇంకా చదవండి.
2. హత్య కేసులో ఏ1గా మాజీ మంత్రి కుమారుడు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు మిస్సింగ్ ఆపై అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ పేరు ఏ1 గా చేర్చడంతో ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది. దళిత యువకుడిది హత్యే అని విచారణ ద్వారా పోలీసులు నిర్ధారించారు. మాజీ మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ను హత్య చేశారని పోలీసుల విచారణలో ధర్మేష్ అనే యువకుడు వెల్లడించాడు. ఇంకా చదవండి.
3. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధైర్యం, త్యాగాలే నాయకత్వంలో ముఖ్య లక్ష్యణాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ, పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వారు గొప్ప ఉదాహరణ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గొప్ప గొప్ప నేతలు ఎప్పుడూ ధైర్య సాహసాలు ప్రదర్శించడంతో పాటు తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఇంకా చదవండి.
4. 'హైడ్రా' కీలక ప్రకటన
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారని, అనుమతులు లేని బిల్డింగ్ కట్టిన వారు మాత్రమే హైడ్రాకు భయపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. తమ వ్యవస్థపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హైడ్రా స్పందించింది. చట్టబద్ధంగా అనుమతులు తీసుకున్న వెంచర్ల విషయంలో ఎలాంటి భయాలు అక్కర్లేదని హైడ్రా స్పష్టం చేసింది. చెల్లుబాటయ్యే అనుమతులు ఉన్న వారి నిర్మాణాలను కూల్చివేసే ప్రసక్తే లేదని హైడ్రా పేర్కొంది. ఇంకా చదవండి.
5. తొలి టెస్టులో భారత్ ఓటమి
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పోరాడి ఓడింది. ప్రత్యర్థి కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జడేజా బౌలింగ్ లో యంగ్ ఫోర్ కొట్టడంతో కివీస్ ఆటగాళ్ల సంబరాల్లో మునిగిపోయారు. కాగా, భారత గడ్డపై న్యూజిలాండ్ కు ఇది మూడో టెస్టు విజయం. విల్ యంగ్ (48 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 నాటౌట్) రాణించారు. టెస్ట్ సిరీస్ లో 1-0తో కివీస్ ఆధిక్యం సాధించింది. ఇంకా చదవండి.